అచ్చ విద్యాసాగర్
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న అచ్చ విద్యాసాగర్ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. ఈ మేరకు ఆయన తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ తరఫున అచ్చ విద్యాసాగర్ 2009లో పోటీ చేశారు. సుదీర్ఘకాలం పాటు టీఆర్‌ఎస్‌లో పని చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్టీలో తగిన గుర్తింపు లేదంటూ అచ్చ అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయమై గతంలో బహిరంగ లేఖ రాశారు. వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. ఈ విషయమై పార్టీ నుంచి స్పందన లేదు.
దీంతో కొంత కాలం వేచి చూసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. ప్రజాచైతన్య యాత్ర సందర్భంగా కాంగ్రెస్ పెద్దలు టచ్‌లోకి రావడం, రాజకీయ భవితవ్యంపై కచ్చితమైన హామీ రావడంతో టీఆర్‌ఎస్ ను వీడేందుకు అచ్చ ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 11న గాంధీభవన్, హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కార్యక్రమానికి వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు 150 వాహనాలతో భారీ కాన్వాయ్‌గా వెళ్లేందుకు అచ్చ అనుచరులు అంతా సిద్ధం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment