
మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం
చేవెళ్ల (రంగారెడ్డి): మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహుర్తం ఖారారైంది. ఈనెల 27న కాంగ్రెస్ పార్టీలో చేరాలని దాదాపు ఖారారు అయిందని విశ్వసనీయ సమాచారం. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వకపోవటంతో నిరాశ చెందిన ఆయన తన అనుచరగణంతో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి పార్టీకి రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదట్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమన్న ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈనెల 27న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు.
జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో కలిసి వెళ్లి పార్టీలో చేరనున్నారని సమాచారం. ఈ విషయాన్ని నియోజకవర్గంలోని ఆయన అనుచరులతో చర్చించి వారిని పెద్ద ఎత్తున వెంట తీసుకెళ్లేందుకు సోమవారం చేవెళ్లలో మారోసారి ఆయన అనుచరులతో సమావేశం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మరి అధిష్టానం ఎవరికి టికెట్‌ను ఇస్తుందో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment