హన్మకొండ చౌరస్తా: భూకబ్జాకోరులపై నగర పోలీ స్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ ఉక్కుపాదం మోపుతున్నా.. కొందరు బకాసురులు మాత్రం మమ్మల్నేమీ చేయలేరన్న ధీమాతో యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు.
ఇప్పటి వరకు ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్న బకాసురులు ఒక అడుగు ముందుకేసి ఏకంగా శ్మశానవాటికనే మాయం చేసే పనిలో నిమగ్నమయ్యారు. వివరా లిలా ఉన్నాయి. హనుమకొండలోని 4వ డివిజన్ పరిధి పెద్దమ్మగడ్డలో దళితులే అత్యధికంగా నివసిస్తుంటారు. సుమారు దశాబ్దకాలం క్రితం వరకు కూడా ఇక్కడ సామాజికంగా వెనుకబాటును అనుభవించారు.
పెద్దమ్మగడ్డ వాసుల శ్మశానవాటికకు ఎసరు
ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దళిత ప్రాంతం పెద్దమ్మగడ్డ. అలాంటి దళితులకు చెందిన సమాధుల గడ్డ ఇప్పుడు కనుమరుగవుతోంది. పెద్దమ్మగడ్డ సమీపంలోనే నాలా వెంట ప్రధాన రహదా రికి ఆనుకుని ఉన్న సమాధుల్లో 99శాతం మాయమయ్యాయి. మిగిలిన ఒకటి రెండు సమాధులను సైతం నేలమట్టం చేసే పనిలో కబ్జాదారులు ఉన్నా రు.
ప్రధాన రహదారి వెంటే సుమారు రెండెకరాల విలువైన స్థలం కావడంతో కోట్ల రూపాయల ధర పలుకుతోంది. దీంతో ఏడాది కాలంగా కొందరు కబ్జారాయుళ్లు రాజకీయ నాయకుల అండదండలతో గుట్టుచప్పుడు కాకుండా సమాధులను నేలమట్టం చేస్తూ మొరంతో ఆనవాళ్లు లేకుండా చదును చేస్తున్నారు. అయినా రెవెన్యూ, బల్దియా అధికారులు పట్టించుకోకపోవడంౖపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment