తనకు న్యాయం చేయాలంటూ సంగీత చేస్తున్న దీక్ష గురువారానికి ఐదోరోజుకు చేరింది. బోడుప్పల్‌లోని భర్త శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్దే ఆమె ఆందోళన కొనసాగిస్తోంది. తనకు స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ ఆందోళన కొనసాగుతుందని సంగీత స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో సంగీత భర్త శ్రీనివాస్ రెడ్డి, మరిది శ్రీధర్ రెడ్డి, అత్త, మామలు ఐలమ్మ, బాల్‌రెడ్డిలను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. కాగా మామ బాల్‌రెడ్డి, మరిది శ్రీధర్ రెడ్డికి బెయిల్ మంజూరు కాగా, అత్త ఐలమ్మకు న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు.