![ocharam srinivas reddy election campaign nizamabad - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/12/pocharam.jpg.webp?itok=H0esc9cg)
ప్రచారంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి
సాక్షి, బాన్సువాడ రూరల్: ఎన్నికల ప్రచారంతో పాటు, ఎల్లారెడ్డిలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్లిన మంత్రి పోచారం మార్గమధ్యలో కొత్తాబాదిలోని ఓ హోటల్ వద్ద ఆగారు. అక్కడ వేడివేడి మిర్చీలు వేశారు. వాటిని రుచి చూడడంతో పాటు తన వెంట ఉన్న కార్యకర్తలు, అధికారులకు రుచిచూపించారు. ఆయన వెంట నాయకులు రమేష్‌రెడ్డి, ఎర్వాల కృష్ణారెడ్డి తదితరులున్నారు.
మీ ఓటు నాకే వేయాలమ్మా..!
సాక్షి, నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామంలో ఆదివారం బీజేపీ అభ్యర్థి పొద్దుటూరి వినయ్‌రెడ్డి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రజలకు కరపత్రాలను అందజేస్తూ తనకే ఓటు వేయాలని అభ్యర్థించారు. వీధివీధినా తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ కమలం పువ్వుకు గుర్తుకు ఓటువేసి తనను గెలిపించాలని కోరారు.
ప్రచారంలో బీజేపీ అభ్యర్థి వినాయ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment