నెమ్లిలో బతుకమ్మ ఆడుతున్న మంత్రి పోచారం
సాక్షి, నస్రుల్లాబాద్: రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయడం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి, బాన్సువాడ నియెజక వర్గ టిఆర్‌ఎస్ పార్టి అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని మిర్జాపూర్,నాచుపల్లి, నెమ్లి, కాంశెట్టి పల్లి, బొమ్మన్ దేవ్ పల్లి, నాచుపల్లి తండా, రాముల గుట్ట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. దీనిలో భాగంగా ప్రతి గ్రామంలోను నాయకులు,ప్రజలు టపాకాయలు పేల్చుతూ ఘనంగా స్వాగతం పలికారు. అంతకు ముందు దుర్కి గ్రామం నుండి మిర్జాపూర్ గ్రామం వరకు మండల నాయకులు, భాస్కర్ రెడ్డి యువసేన భారీ బైక్ ర్యాలీ తీశారు.
మిర్జాపూర్ గ్రామంలోని ఎస్సి కమ్యునిటి భవనంలో మహిళలతో ముచ్చటించారు. అనంతరం నెమ్లి గ్రామంలోని మహిళలతో బతుకమ్మ ఆడారు. నిజాంసాగర్ ఆయకట్టు క్రింద ఉన్న పంట పొలాల్లో ఒక్క గుంట కూడా ఎండనివ్వమన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలను వివరించాలని పేర్కొంటూ ఈ నెల 21, 23 తేదీల్లో ఐక్యరాజ్య సమితి అధ్వర్యంలోని వ్యవసాయ విభాగ ఆహార వ్యవసాయ సంస్థ కేంద్ర కార్యాలయం రోమ్ నగరానికి రావాల్సిందిగా పిలుపు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లెల మీనా, మాజీ ఏఎంసీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, మాజి జెడ్పిటిసీ ద్రోణవల్లి సతీష్, మండల టీఆర్‌ఎస్ పార్టి అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, జిల్లా మాజి గ్రంథాలయ చైర్మన్ దివిటి శ్రీనివాస్ యాదవ్, నాయకులు పురం వెంకటి, గంగారం, శ్యామల తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment