నామినేషన్ అనంతరం గంపగోవర్ధన్ తదితరులు
సాక్షి,కామారెడ్డి: ప్రజల చిరకాల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కామారెడ్డి నియోజకవర్గంలో నాలుగేళ్లలో దాదాపు వెయ్యి కోట్లతో అభి వృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, ఈ ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని టీఆర్‌ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ కోరారు. జిల్లా కేంద్రం లోని ఆర్డీవో కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన నామినేషన్ వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేంద్రకుమార్‌కు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గంప గోవర్ధన్ సమర్పించారు.
నామినేషన్ అనంత రం బయటకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాలన దేశంలోనే అగ్రగామిగా నిలిచి పోతుం దని చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గంలోనూ దాదాపు రూ. వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని, జిల్లా గా ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. కామారెడ్డికి రానున్న రెండేళ్ల లో కాళేశ్వరం నీళ్లు తెచ్చి ప్రతి ఎకరానికి రెండు పంటలకు సరిపడా నీరందిస్తామన్నారు.
రెండు సెట్ల నామినేషన్ దాఖలు..
డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దిన్, మున్సిపల్ చైర్‌పర్సన్ పిప్పిరి సుష్మ ఆయన అభ్యర్థిత్వాన్ని బలపర్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నామినేషన్ సందర్భంగా టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆర్‌డీవో కా>ర్యాలయం వద్దకు చేరుకున్నాయి. నామినేషన్ అనంతరం గంపగోవర్ధన్‌ను పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్‌ఎస్ నేతలు నిట్టు వేణుగోపాల్‌రావు, ఆత్మ కమిటీ చైర్మన్ బల్వంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment