నామినేషన్ వేసేందుకు వెళ్తున్న హన్మంత్ సింధే
సాక్షి,మద్నూర్/నిజాంసాగర్: అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. విడుదలైన మొద టి రోజు అభ్యర్థులేవరు నామినేషన్ దాఖలు చేయలేదు. రెండవ రోజైన మంగళవారం జుక్కల్ అ సెంబ్లీ నియోజికవర్గం జుక్కల్ అ సెంబ్లీ నియోజికవర్గం హన్మంత్‌సింథే నామినేషన్ వేశారు. జుక్కల్ నియోజికవర్గంలో మొదటి రోజు ఎలాంటి నామినేషన్లు దా ఖలు కాలేదు. టీఆర్‌ఎస్ అభ్యర్థి హన్మంత్‌సింధే ఎ లాంటి హంగు, ఆర్భాటాలు లేకుండ కేవలం నలుగురితో కలిసి వచ్చి నామినేషన్ వేసి వెళ్లారు. సాదాసీదాగా ఆయన నామినేషన్ వేయడం విశేషం.
మద్నూర్ మండల కేంద్రంలోని సలాబత్‌పూర్ హ నుమాన్ ఆలయంలో ఎంపీ బీబీపాటిల్, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌తో కలిసి హన్మంత్‌సింధే ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, జడ్పీ చైర్మెన్ రాజు, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మెన్ అన్నారం వెంకట్‌రాంరెడ్డి ఆయన వెంట ఉన్నా రు. నామినేషన్లు వేసేందుకు ఈనెల 14, 18, 19 తేదీల్లో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థు లు సి ద్ధమవుతున్నారు. జుక్కల్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అ భ్యర్థి హన్మంత్ సింధే రిటర్నింగ్ అధికారికి ఇచ్చిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలు అందజేశారు.
సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: సింధే
కేసీఆర్ ప్రవేశ పట్టిన సంక్షేమ పథకాలే గెలుపిస్తాయని టీఆర్‌ఎస్ అభ్యర్థి హన్మంత్‌సింధే అన్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన మాట్లాడుతు టీఆర్‌ఎస్ చేపడుతున్న అభివృద్ధి పనులు మీ కళ్ల ముందే ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment