
ప్లీజ్ .. ప్లీజ్ .... మా ఇంటికి రండీ!
‘రండి రండి రండీ... దయ చేయండి, తమరి రాక మాకెంతో ఆనందం సుమండీ..’
‘రండి రండి రండీ... దయ చేయండి, తమరి రాక మాకెంతో ఆనందం సుమండీ..’ అని పాడుకుందామనుకున్న ఓ సీనియర్ రాజకీయ దిగ్గజానికి కొద్ది రోజులు నిరాశ తప్పలేదు. మాటిచ్చారు కదా.., ప్లీజ్ ఒక్కసారి మా ఇంటికి వచ్పిపోండి.. పరువు కాపాడండి, లేదంటే నా మాజీ పార్టీ వాళ్ల ముందు ఇజ్జత్ పోతదని ఆ నేత తెగ ఫీలయిపోయారు. ఎట్టకేలకు ఆ గులాబీ దళపతి సీనియర్ నేత ఇంటి గడపతొక్కడంతో కథ సుఖాంతమైంది.
కానీ, నాలుగైదు రోజులు కాస్తా.. రెండు వారాలు కావడం, ఇదిగో వస్తా.. అదిగో వస్తా అని సమాచారం ఇవ్వడం, క్యాన్సిల్ కావడంతో ఆందోళన చెందిన ఆ సీనియర్ నేత లాభం లేదని బతిమిలాడుకోవాల్సి వచ్చిందట. అప్పటికే ఓ సారి మీడియాకూ ఆహ్వానం పంపినా, గులాబీ అధిపతి రాకపోయే సరికి జనాలు రకరకాలుగా చెవులు కొరుక్కోవడం రుచించని దిగ్గజ నేత తెగ ఆందోళన చెందారట. చివరకు ఏదో రకంగా ఒప్పించి, ఇంటికి రప్పించి, బిర్యానీ పెట్టి, మాటా ముచ్చట తీర్చుకుని ఊపిరి పీల్చుకున్నడు ..!!