రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాక ఇసుక క్వారీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, సీఎం కార్యా లయానికి, సీఎం బంధువులకు ఈ క్వారీ
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
సాక్షి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాక ఇసుక క్వారీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, సీఎం కార్యా లయానికి, సీఎం బంధువులకు ఈ క్వారీ లో ప్రమేయం ఉండడం వల్లే చర్యలు తీసుకోవడం లేదని మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సోమవారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం బంధు వుల పేరిట ఉన్న ఇసుక క్వారీ అగ్రిమెంట్ పత్రాలను విడుదల చేశారు.
కొదురుపాక నుంచి నిత్యం 500 లారీల ద్వారా ఇసుకను అక్రమంగా హైదరాబాద్ తదితర ప్రాం తాలకు నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఈ క్వారీ కాంట్రాక్ట్ పొందింది సీఎంవోలో కీలక వ్యక్తి అయిన సంతోష్‌రావుది కాదా? ఆయన సీఎం తోడల్లుడైన రవీందర్‌రావు కుమారుడు కాదా? అని ప్రశ్నించారు. ఈ కాంట్రాక్ట్ పొందిన గోల్డ్‌మైన్స్ మినరల్స్ సంస్థలో భాగస్వామి కాదా? ఈ పత్రాలు కూడా తప్పుడువేనా? అని టీఆర్‌ఎస్ నేతలను నిలదీశారు.