సూర్యాపేట జిల్లా: సూర్యాపేట రూరల్ మండలం ఎల్కరం గ్రామంలో టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎల్కారం టీడీపీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్నను గ్రామ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు జనార్థన్ అభివృద్ధి పనులపై ప్రశ్నించాడు. ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని ఎంక్వైరీ కోసం పై అధికారులను ఆశ్రయించాడు. దీంతో కోపం పెంచుకున్న ఒంటెద్దు వెంకన్న తన అనుచరులతో కలిసి జనార్థన్‌పై దాడికి దిగాడు. ఈ ఘటనలో జనార్థన్‌కు గాయాలవ్వడంతో సూర్యాపేట్‌కు తీసుకువెళ్లారు. జనార్ధన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.