టీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్తలపై దాడి | Congress Leaders Attack OnTRS Women Leader | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్తలపై దాడి

Published Fri, Jan 11 2019 11:53 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Congress Leaders Attack OnTRS Women Leader - Sakshi

అల్లాదుర్గం(మెదక్‌): కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఓటమి భయంతో, టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నారనే నేపంతో భౌతిక దాడులకు దిగుతున్నారని అల్లాదుర్గం మండలం రెడ్డిపల్లి టీఆర్‌ఎస్‌ నాయకులు రవీందర్‌రెడ్డి, పోచయ్యలు గురువారం స్థానిక విలేకర్లతో చెప్పారు. బుధవారం నామినేషన్లు వేసి ఇళ్లకు వెళ్తున్న దళిత టీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్తలపై రాళ్లదాడి చేశారన్నారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన గడ్డం భూమమ్మకు తలపగిలి తీవ్ర గాయాలయ్యయని తెలిపారు.

కాంగ్రెస్‌ నాయకుడు నర్సింహారెడ్డి, ఇతర కాంగ్రెస్‌ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై రాళ్ల దాడి చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ వారే దాడులకు పాల్పడుతూ వారిపైనే దాడి చేసినట్లు తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారని వారన్నారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement