కన్నా పై కేటీఆర్‌ ఫైర్‌ ? | Minister KTR Fire on Yekkala Kanna | Sakshi
Sakshi News home page

కన్నా పై కేటీఆర్‌ ఫైర్‌ ?

Published Sun, Nov 12 2017 8:36 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

 Minister KTR Fire on Yekkala Kanna - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇటీవల టౌన్‌ప్లానింగ్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పై దాడికి పాల్పడిన కాచిగూడ కార్పొరేటర్‌ చైతన్య భర్త ఎక్కాల కన్నాపై మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు శనివారం కన్నాను ప్రగతి భవన్‌కు పిలిపించిన మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ నీ సొంతమనుకుంటున్నావా.. పార్టీ పేరు చెప్పుకొని దాడులకు పాల్పడతావా అంటూ మండిపడ్డట్లు సమాచారం.

చేసింది చాలక సెక్షన్‌ ఆఫీసర్‌ పై పోలీస్‌స్టేషన్‌లో కేసు ఎందుకు పెట్టావు.. ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేయొద్దని చెప్పినా ఎందుకు చేశావు అంటూ తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న కాచిగూడ మహిళా సెక్షన్‌ అధికారి జి.వాణిపై బుధవారం ఎక్కాల  కన్నా దౌర్జన్యానికి దిగాడు. దీంతో ఆయనపై పోలీసులకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement