టీఆర్‌ఎస్‌ నాయకుడి దుర్మరణం | TRS Leader Died In Accident While Going Morning Walk In Keesara | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 23 2018 12:00 PM | Last Updated on Tue, Oct 23 2018 12:38 PM

TRS Leader Died In Accident While Going Morning Walk In Keesara - Sakshi

సాక్షి, కీసర/మేడ్చల్‌ : టీఆర్‌ఎస్‌ నాయకుడి హఠాన్మరణం కీసర మండలంలో కలకలం రేపింది. మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన మండల మాజీ వైస్‌-ఎంపీపీ బి.భరత్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వివరాలు.. మార్నింగ్‌ వాక్‌ చేయడానికి బైక్‌పై వెళ్తున్న భరత్‌రెడ్డిని గుర్తు తెలియని లారీ వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన చుట్టుపక్కలవారు ఆయనను జినియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భరత్‌రెడ్డి మృతిచెందినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రమాద దృశ్యాలు ఓ సీసీటీవీలో నమోదయ్యాయి. కాగా, భరత్‌రెడ్డి మృతిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement