'అగ్గిపెట్టిలాంటి ఆ పార్టీకి నిలకడలేదు'
హైదరాబాద్ : టీఆర్‌ఎస్ గూండాయిజాన్ని పెంచి పోషిస్తోందని, అగ్గిపెట్టె లాంటి ఆ పార్టీకి నిలకడలేనిదని టీడీపీ సనత్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూన వెంకటేశ్‌గౌడ్ ఎద్దేవా చేశారు. సనత్‌నగర్‌లోని శుక్రవారం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలనా విధానం సరిగా లేదని ఆరోపించారు. ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు గతంలో రూ.6 లకు యూనిట్ చొప్పున కరెంటు కొనుగోలు చేస్తే ఇప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.12లకు కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజలపై మోపుతోందని విమర్శించారు.
కరెంట్ అధిక ధరకు కొనుగోలు చేస్తున్నా... విద్యుత్ కోతలు తప్పడం లేదని, రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం నిలువరించలేకపోతోందన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు కిందిస్థాయి వారిని కూడా వదలకుండా బెదిరింపులకు పాల్పడుతూ గుండాగిరీకి పాల్పడుతున్నారని పరోక్షంగా తలసానిని ఉద్దేశించి అన్నారు. టీడీపీ పార్టీ గుర్తుపై గెలిచిన తలసాని దమ్ముంటే రాజీనామాను ఆమోదించుకుని ఎన్నికలకు రావాలని కూన వెంకటేశ్ గౌడ్ సవాల్ విసిరారు.