అప్పుడు నా సీటును తలసాని దొంగిలించారు!
హైదరాబాద్: గతంలో తనకు దక్కాల్సిన సనత్ నగర్ ఎమ్మెల్యే సీటును అప్పటి టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ దొంగిలించారని టీడీపీ నేత కూన వెంకటేశ్ గౌడ్ స్పష్టం చేశారు. నాలుగేళ్ల నుంచి ఆ సీటు కోసం కష్టపడితే తలసాని చాకచక్యంగా దక్కించుకున్నారన్నారు. ఈసారి మాత్రం ఆ సీటు తనదేనని వెంకటేశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ముఖేష్ గౌడ్ లేదా? మరెవరు పోటీకి వచ్చినా.. సనత్ నగర్ టికెట్ తనకే దక్కుతుందన్నారు.
గత ఎన్నికల్లో చంద్రబాబు తనకు సరిగ్గా మాట ఇవ్వలేదని.. అయితే ఈసారి ఆయన నుంచి తనకు హామీ లభించిదన్నారు. దేవేందర్ గౌడ్ కూడా తనకు మద్దతు ఇస్తామని తెలిపారన్నారు. ఇప్పుడు నడుస్తున్నదంతా తప్పుడు ప్రచారమేనన్నారు. ముఖేష్ గౌడ్ తనకు బంధువేనని ఒక ప్రశ్నకు సమాధానంగా వెంకటేశ్ గౌడ్ తెలిపారు.