'ఆ గ్రామాలు సీమాంధ్రలో కలపకుండా అడ్డుకోండి' | Kodandaram Slams Polavaram Villages To Merge in Seemandhra | Sakshi
Sakshi News home page

'ఆ గ్రామాలు సీమాంధ్రలో కలపకుండా అడ్డుకోండి'

Published Fri, Feb 28 2014 12:53 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

'ఆ గ్రామాలు సీమాంధ్రలో కలపకుండా అడ్డుకోండి' - Sakshi

'ఆ గ్రామాలు సీమాంధ్రలో కలపకుండా అడ్డుకోండి'

పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాలనే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. కేంద్రం ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆయన తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.



పోలవరం ముంపు ప్రాంతాలలో భద్రచలం రెవెన్యూ గ్రామం మినహా పలు గ్రామాలను సీమాంధ్రలో కలిపేందుకు కేంద్రం సూత్రపాయంగా అంగీకరించింది. అయితే తమను తెలంగాణలోనే ఉంచాలని అయా గ్రామాల ప్రజలు ఇటీవల ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం సీమాంధ్రలో కలపాలని ఆ ప్రాంత కేంద్ర మంత్రులు చేసిన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

 

సీమాంధ్ర కేంద్ర మంత్రుల ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించ వద్దంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన పలు పార్టీలు నేతలు కేంద్రంపై ఒత్తిడి చేశారు. దాంతో పోలవరం ముంపునకు గురయ్యే కొన్ని గ్రామాలను మాత్రం సీమాంధ్రలో కలిపేందుకు కేంద్రం అంగీకరించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement