అసెంబ్లీలో ఏ అంశంపై అయినా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్రావు స్పష్టం చేశారు.
హైదరాబాద్ : అసెంబ్లీలో ఏ అంశంపై అయినా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్రావు స్పష్టం చేశారు. శనివారం తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వెంటనే స్పందించిన హరీశ్రావు మాట్లాడుతూ... సభ సజావుగా సాగటం ప్రతిపక్షానికి ఇష్టం లేనట్లు ఉందని అన్నారు. ప్రశ్నోత్తరాలు కొనసాగించేందుకు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ సభ్యులకు హరీశ్ రావు సూచించారు.