జంగంపల్లిలో కాకతీయ పనులు ప్రారంభించిన హరీశ్ | harish rao takes on tdp,cong and jac leaders | Sakshi
Sakshi News home page

జంగంపల్లిలో కాకతీయ పనులు ప్రారంభించిన హరీశ్

Published Fri, Jun 17 2016 12:19 PM | Last Updated on Tue, Mar 19 2019 5:47 PM

harish rao takes on tdp,cong and jac leaders

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లిలో మిషన్ కాకతీయ పనులను తెలంగాణ భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో  హరీశ్రావు మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ ప్రాజెక్టును కాంగ్రెస్, టీడీపీ, జేఏసీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.


తెలంగాణాను తాము సస్యశ్యామలం చేద్దామనుకుంటుంటే వారు అడుగడుగునా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. గోదావరి నీళ్లు తెచ్చి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మారుద్దామని ప్రయత్నిస్తుంటే... విపక్షాలు మాత్రం ఎక్కడ కేసీఆర్‌కు మంచిపేరు వస్తుందోనని ఆటంకాలు కలిగిస్తున్నారన్నారు. టీడీపీ, కాంగ్రెస్, జేఏసీ నేతలను ఎక్కడికక్కడే నిలదీసి ప్రశ్నించాలని.. ప్రజలుకు హరీశ్రావు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement