తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మంచి పనుల వల్లే నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో విజయం సాధించామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మంచి పనుల వల్లే నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో విజయం సాధించామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్లో హరీశ్రావు మాట్లాడుతూ... జల విధానాన్ని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటిస్తారని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమని హరీశ్ తెలిపారు. వరుస ఓటముల పాలైన మారడం లేదంటూ విపక్షాలకు హరీశ్ ఈ సందర్భంగా చురకలు అంటించారు.