డి.కె.అరుణ, పొన్నాల నిరాహార దీక్ష ప్రారంభం | Aruna, Ponnala on 2 day hunger strike today starts | Sakshi
Sakshi News home page

డి.కె.అరుణ, పొన్నాల నిరాహార దీక్ష ప్రారంభం

Published Sat, Sep 3 2016 10:23 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

Aruna, Ponnala on 2 day hunger strike today starts

హైదరాబాద్ : జిల్లాల విభజనలో అశాస్త్రీయంగా,  అడ్డగోలుగా ఉందని ఆరోపిస్తూ మాజీ మంత్రులు డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య శనివారం ఇందిరాపార్కు వద్ద రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో వారితోపాటు ఎమ్మెల్యే సంపత్కుమార్ పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో గద్వాల్తోపాటు వరంగల్ జిల్లాలోని జనగామను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణలో మొత్తం 27 జిల్లాలు ఏర్పడనున్నాయి. అయితే కొత్తగా ఏర్పడుతున్న జిల్లాల్లో జాబితాలో జనగామ, గద్వాల్ లేకపోవడంతో డి.కె.అరుణ, పొన్నాల లక్ష్మయ్యలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. జిల్లాల ఏర్పాటులో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా వారు శనివారం నిరాహారదీక్షకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement