d k aruna
-
గద్వాల సభలో కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు
-
డి.కె.అరుణ, పొన్నాల నిరాహార దీక్ష ప్రారంభం
హైదరాబాద్ : జిల్లాల విభజనలో అశాస్త్రీయంగా, అడ్డగోలుగా ఉందని ఆరోపిస్తూ మాజీ మంత్రులు డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య శనివారం ఇందిరాపార్కు వద్ద రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో వారితోపాటు ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల్తోపాటు వరంగల్ జిల్లాలోని జనగామను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 27 జిల్లాలు ఏర్పడనున్నాయి. అయితే కొత్తగా ఏర్పడుతున్న జిల్లాల్లో జాబితాలో జనగామ, గద్వాల్ లేకపోవడంతో డి.కె.అరుణ, పొన్నాల లక్ష్మయ్యలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. జిల్లాల ఏర్పాటులో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా వారు శనివారం నిరాహారదీక్షకు దిగారు. -
శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి డికె అరుణ
-
డబుల్ బెడ్ రూం ప్లాట్‌కు రూ. లక్షా ?
హైదరాబాద్: టీఆర్ఎస్ సర్కారు షరతుల ప్రభుత్వంగా మారిందని మాజీ మంత్రి, టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ మంగళవారం హైదరాబాద్‌లో ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి రూ. లక్ష కట్టాలని షరతు విధించటం సరికాదన్నారు. పేదలు రూ. లక్ష కట్టలేకపోతే డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని అమలు చేయరా అని ఆమె కేసీఆర్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ పధకాన్ని ఆటకెక్కించే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఈ విధంగా షరతులు విధిస్తోందని డీకే అరుణ అరోపించారు. కాంగ్రెస్ హయాంలో మంజూరైన బిల్లులను కూడా పెండింగ్‌లో పెట్టి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వాణిజ్యపన్నుల శాఖ మంత్రి టి.శ్రీనివాసయాదవ్ తన రాజీనామాను ఆమోదింప చేసుకోవాలని ఆయనకు హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఒరవడి ఉండాలంటున్న సీఎం కేసీఆర్... తమ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదింప చేసి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలని ఆయనకు డీకే అరుణ హితవు పలికారు. -
ఎన్టీఆర్ మరణానికి కారకులు ఎవరు?:అక్బరుద్దీన్
హైదరాబాద్:శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్‌లోని డొమెస్టిక్ టెర్మినల్‌కు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పెట్టే అంశంపై తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర చర్చలు జరిగాయి. ఈ అంశంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. తెలుగు మాట్లాడే ప్రజలకు ఎన్టీఆర్ గొప్ప నేత అని కొనియాడుతూనే.. సభలో ఇంగ్లిష్, ఉర్దూల భాషలను విస్మరిస్తున్నారు. అసలు ఎన్టీఆర్ మరణానికి కారకులు ఎవరు? అంటూ అక్బరుద్దీన్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా పేరు మార్చడం సరికాదన్నారు. ఎలాంటి సలహాలు, సూచనలు లేకుండా పేరు మార్చడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.ఎయిర్ పోర్ట్ నిర్మించిన స్థలం శంషుద్దీన్, అక్బరుద్దీన్ లకు చెందినది ఆయన తెలిపారు. -
ఎన్టీఆర్ పేరు ఎలా పెడతారు?
హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్‌లోని డొమెస్టిక్ టెర్మినల్‌కు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు ఎలా పెడతారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ... శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై ఆమె ఆగ్రహాం వ్యక్తం చేశారు. కావాలంటే ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా నిర్మించే ఎయిర్‌పోర్ట్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టుకోవాలని అరుణ కేంద్రప్రభుత్వానికి సూచించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక రన్‌వే మాత్రమే ఉంది... కాబట్టి టెర్మినల్‌కు మరోకరి పేరు పెట్టడం సరికాదని అరుణ వ్యాఖ్యానించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పేరు మార్పుపై అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్నికోరాలని డీకే అరుణ ఈ సందర్బంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. -
పాలమూరులోనే 272 పాఠశాలలు మూతబడ్డాయి
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠాశాల పరిస్థితి దయనీయంగా ఉందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై చర్చ జరిగిన సందర్భంగా అరుణ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లు లేరని ఆమె తెలిపారు. కొన్ని ప్రాంతంలో 200 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఒకే ఒక్క టీచర్ ఉంటున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా నెలకొందని తెలిపారు. దీంతో గ్రామాలలో ఎంతో మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని అరుణ పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో టీచర్లు లేక 272 పాఠశాలలు మూతబడ్డాయని ఆమె చెప్పారు. -
ప్రభుత్వాన్ని నిలదీస్తాం!
-
'మహబూబ్‌నగర్ లో అసలు బతుకమ్మ సంప్రదాయమే లేదు'
హైదరాబాద్: మహబూబ్‌నగర్ (పాలమూరు) జిల్లాలో అసలు బతుకమ్మ సంప్రదాయమే లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. అలాంటి జిల్లాలో బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ కవితను పిలవడమేంటని అరుణ ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లో సీఎల్పీ కార్యాయలంలో అరుణ మాట్లాడుతూ... పండగ సెంటిమెంట్‌తో అధికార టీఆర్ఎస్ రాజకీయ లబ్ది పొందాలని చూస్తుందని విమర్శించారు. ఈ సాకుగా చూపి ప్రజలను విభజించాలనుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో బతుకమ్మ ఆడామని డికే అరుణ విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. దసరా పండగకు సెలవులు పెంచి... సంక్రాంతికి తగ్గించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. -
'విద్యార్థులకు ఉదయం అల్పాహారాన్ని అందించాలి'
మహబూబ్‌నగర్: పాఠశాలల సమయాన్ని మార్చడానికి ముందు అందుకు అనుగుణమైన పరిస్థితులు కల్పించాలని మాజీ మంత్రి డీకే అరుణ తెలంగాణ ప్రభుత్వాన్నికి హితవు పలికారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో ఆమె మాట్లాడుతూ... మధ్యాహ్న భోజన పథకం తరహాలో విద్యార్థులకు ఉదయం అల్పాహారాన్ని ప్రభుత్వమే అందించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సుల రాకపోకల సమయాన్ని మార్చాలని అన్నారు. పాఠశాల విద్యార్థుల స్కూల్ సమయం ఇక నుంచి ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపాలని డీకే అరుణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
'విలీనానికి షరతులు పెట్టడం సరికాదు'
-
'కేసీఆర్ మాటకు కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నా'
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని రాష్ట్ర మంత్రి డి.కె.అరుణ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కి అండగా నిలుస్తారని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆమె మాట్లాడుతూ... ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కీలకపాత్ర పోషించదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని విలీనం చేస్తానన్న మాటలకు కేసీఆర్ కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నట్లు డి.కె.అరుణ వెల్లడించారు. -
బాలల చిత్రోత్సవం అద్భుతం
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల పాటు రాష్ట్ర రాజధాని వేదికగా లక్షలాది విద్యార్థులు, విదేశీ అతిథులకు ఆనందాన్ని పంచిన 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆయన భార్య విమలా నరసింహన్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ, సినీ నటుడు పవన్‌కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ చిత్రాలుగా ఎంపికైన వాటికి ప్రముఖుల చేతుల మీదుగా బంగారు ఏనుగులను(గోల్డెన్ ఎలిఫెంట్) ప్రదానం చేశారు. ఈనెల 14 నుంచి మొదలైన బాలల చలనచిత్రోత్సవాలు 48 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు మంచి అనుభూతులను మిగిల్చాయని ప్రముఖులు పేర్కొన్నారు. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. భాష, సంస్కృతి, ప్రాంతాలకు అతీతంగా యువతీ, యువకులు వారి బాధలు, సంతోషాలు, ఆశలు, ఆశయాలను చిత్రాల రూపంలో పిల్లల ముందు అద్భుతంగా ఆవిష్కరించారని ప్రశంసించారు. ఇంతటితో ఆగిపోకుండా మరింత ముందుకు సాగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ ఉత్సవం సందర్భంగా లక్ష మందికిపైగా చిన్నారులు చిత్రాలను చూశారని మంత్రి డీకే అరుణ తెలిపారు. చిత్ర ప్రదర్శనలే కాకుండా పిల్లల హక్కులు, లింగ వివక్ష తదితర అంశాలపై చర్చాగోష్టులు కూడా నిర్వహించామని ఉత్సవ కమిటీ సంచాలకులు, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలు హైదరాబాద్‌లో నిర్వహించడం తనకు సంతోషంగా ఉందని నటుడు పవన్ కల్యాణ్ తెలిపారు. సీఎస్ మహంతి, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎన్.శివశంకర్, మేనేజింగ్ డెరైక్టర్ దాన కిశోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కాగా, గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వీఐపీ గ్యాలరీలో కూర్చు న్న ఒక వ్యక్తి ‘జై సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకుని నినాదాలు చేశారు. పోలీసులు ఆయనను బయటకు తీసుకెళ్లడంతో గందరగోళం సద్దుమణిగింది. బంగారు ఏనుగు, ఫలకాలు అందుకున్న చిత్రాలు లిటిల్ డెరైక్టర్స్ విభాగం: ఉత్తమ చిన్నారి దర్శకుడు: బ్రేకింగ్ ది సెలైన్స్, టమాటర్ చోర్ రెండో ఉత్తమ చిన్నారి దర్శకుడు: ఎకోల్ మోండియెల్ వరల్డ్ స్కూల్, పూల్వతి అమ్మ ఉత్తమ చిన్నారి దర్శకుడు (జ్యూరీ స్పెషల్): 1. ది ట్రిక్, 2. అవర్ బిట్, 3. గివ్ మీ ఏ ఛాన్స్ ఇంటర్నేషనల్ లఘు చిత్రాల విభాగంలో ఉత్తమ లఘు చిత్రం: చింటి, రష్యా రెండో ఉత్తమ లఘు చిత్రం: నూడుల్ ఫిష్, చిన్నారుల జ్యూరీ: తమాష్, భారత్ ప్రత్యేక ఎంపిక: మై షూస్ యానిమేషన్ విభాగం ఉత్తమ యానిమేషన్ ఫీచర్: ఎర్నెస్ట్ ఈటీ సెలస్టిన్ రెండో ఉత్తమ యానిమేషన్ ఫీచర్: జరాఫా బెస్ట్ ఆర్ట్ వర్క్(జ్యూరీ బహుమతి): గోపీ గవయ్యా బాఘా భజయ్యా, భారత్ స్పెషల్ జ్యూరీ అవార్డు: మూన్ మ్యాన్ ఉత్తమ యానిమేషన్ ఫీచర్( చిన్నారుల జ్యూరీ): అర్జున్ లైవ్ యాక్షన్ విభాగం ఉత్తమ లైవ్ యాక్షన్ ఫీచర్: కౌబాయ్, డచ్ రెండో ఉత్తమ లైవ్ యాక్షన్ ఫీచర్: ఎ హార్స్ అన్ ద బాల్కనీ ఉత్తమ లైవ్ యాక్షన్ డెరైక్టర్: బతుల్ ముక్తియార్(కఫాల్ సినిమా డెరైక్టర్) ఉత్తమ లైవ్ యాక్షన్ స్క్రీన్‌ప్లే : నోనో ది జిగ్ జాగ్ కిడ్ ఉత్తమ లైవ్ యాక్షన్ ఫీచర్ (చిన్నారుల జ్యూరీ): ది హార్స్ ఆన్ ది బాల్కనీ బెస్ట్ సినిమాటోగ్రఫీ (చిన్నారుల జ్యూరీ): విండ్ స్ట్రాం ఉత్తమ సందేశాత్మక చిత్రం (చిన్నారుల జ్యూరీ): మదర్ ఐ లవ్ యూ