
'విద్యార్థులకు ఉదయం అల్పాహారాన్ని అందించాలి'
మహబూబ్నగర్: పాఠశాలల సమయాన్ని మార్చడానికి ముందు అందుకు అనుగుణమైన పరిస్థితులు కల్పించాలని మాజీ మంత్రి డీకే అరుణ తెలంగాణ ప్రభుత్వాన్నికి హితవు పలికారు. ఆదివారం మహబూబ్నగర్లో ఆమె మాట్లాడుతూ... మధ్యాహ్న భోజన పథకం తరహాలో విద్యార్థులకు ఉదయం అల్పాహారాన్ని ప్రభుత్వమే అందించాలని డిమాండ్ చేశారు.
గ్రామీణ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సుల రాకపోకల సమయాన్ని మార్చాలని అన్నారు. పాఠశాల విద్యార్థుల స్కూల్ సమయం ఇక నుంచి ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపాలని డీకే అరుణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.