
'కేసీఆర్ మాటకు కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నా'
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని రాష్ట్ర మంత్రి డి.కె.అరుణ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కి అండగా నిలుస్తారని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లో ఆమె మాట్లాడుతూ... ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కీలకపాత్ర పోషించదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని విలీనం చేస్తానన్న మాటలకు కేసీఆర్ కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నట్లు డి.కె.అరుణ వెల్లడించారు.