ఎన్టీఆర్ పేరు ఎలా పెడతారు? | Telangana Congress mla D K Aruna takes on central government | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ పేరు ఎలా పెడతారు?

Published Fri, Nov 21 2014 11:38 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

ఎన్టీఆర్ పేరు ఎలా పెడతారు? - Sakshi

ఎన్టీఆర్ పేరు ఎలా పెడతారు?

హైదరాబాద్: శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లోని డొమెస్టిక్ టెర్మినల్కు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు ఎలా పెడతారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ... శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై ఆమె ఆగ్రహాం వ్యక్తం చేశారు.

కావాలంటే ఆంధ్రప్రదేశ్లో నూతనంగా నిర్మించే ఎయిర్పోర్ట్కు ఎన్టీఆర్ పేరు పెట్టుకోవాలని అరుణ కేంద్రప్రభుత్వానికి సూచించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక రన్వే మాత్రమే ఉంది... కాబట్టి టెర్మినల్కు మరోకరి పేరు పెట్టడం సరికాదని అరుణ వ్యాఖ్యానించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పేరు మార్పుపై అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్నికోరాలని డీకే అరుణ ఈ సందర్బంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement