ఎన్టీఆర్ పేరు మార్చే ప్రసక్తే లేదు: జైట్లీ | ntr name for domestic terminal will be the same, clarifies arun jaitley | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ పేరు మార్చే ప్రసక్తే లేదు: జైట్లీ

Published Wed, Nov 26 2014 2:07 PM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

ntr name for domestic terminal will be the same, clarifies arun jaitley

న్యూఢిల్లీ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌ పేరు మార్పుపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేశారు. దేశీయ టెర్మినల్ పేరు మార్చే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. అంతర్జాతీయ టెర్మినల్కు రాజీవ్ గాంధీ పేరే ఉంటుందని, దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరే కొనసాగుతుందని ఆయన బుధవారం రాజ్యసభలో స్పష్టం చేశారు. 

రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్ పేర్లలో ఎలాంటి మార్పు ఉండదని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.  రాజీవ్, ఎన్టీఆర్ ఇద్దరూ గౌరవప్రదమైన నేతలేనని అన్నారు. కాగా దేశీయ టెర్మినల్ పేరు మార్పుపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. పేరు మార్చడాన్ని తప్పుబట్టిన వారు... రాజీవ్ పేరు యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్పై జైట్లీ పైవిధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement