సాక్షి, హైదరాబాద్: గొల్కొండ, చార్మినార్ వంటి చారిత్రక కట్టడాలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం తగ్గుతుంటే మంత్రి కేటీఆర్ మాత్రం బ్రాండ్ హైదరాబాద్ అంటూ అబద్ధాలు మాట్లాడుతున్నాడని మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ విమర్శించారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) ఇచ్చిన నివేదికలో ఇప్పటిదాకా తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల జాబితా నుంచి హైదరాబాద్‌ను తొలగించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ఎందుకు దాస్తున్నాడని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాండ్ హైదరాబాద్.. డామేజ్ హైదరాబాద్ అయిందన్నారు.