K Janareddy
-
కాంగ్రెస్‌నే మోరీల్లో వేస్తారు..
నిడమనూరు (నాగార్జునసాగర్) : టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేని కాంగ్రెస్‌ను ప్రజలు 2019 ఎన్నికల్లో మోరీల్లో వేస్తారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని గుంటిపల్లి, ఎర్రబెల్లిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి సభలో మంత్రి మాట్లాడుతూ తాగిన మత్తులో చేసుకున్న హత్యను రాజకీయలబ్ధికి కాంగ్రెస్ రాష్ట్ర, జాతీయ నాయకులు వాడుకోవడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల మొండేలతో మోరీలు నిండుతాయని కాంగ్రెస్ నేతలు చెప్పారని.. మా ఆలోచన అలాంటిది కాదని.. అభివృద్ధే ఎజెండాగా పనిచేస్తామని చెప్పారు. ఎక్కువ శాఖలు చేసిన అని గొప్పలు చెప్పుకుంటున్న జానారెడ్డి తన సమక్షంలో అధికార పార్టీ ఎమ్మెల్యే, మంత్రి మీద ఆరోపణలు చేస్తుంటే ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించారు. జానారెడ్డి నియోజకవర్గంలో సమస్యలు ఉండవనుకున్నానని.. కానీ మిగతా నియోజకవర్గాలతో పోల్చితే ఇక్కడే ఎక్కువ ఉన్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో డజను సీట్లు టీఆర్ఎస్ గెలుచుకుంటుందని అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంతో పాటు జిల్లాలో ప్రతి గ్రామానికి శుద్ధిచేసిన జలాలను అందిస్తామన్నారు. కేసీఆర్ వెంటే.. సాగర్ నియోజకవర్గం ఉంటదని ఎర్రబెల్లి ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో నిరూపన అయ్యిందన్నారు. ఎక్కువ కాలం జానారెడ్డికి ఓటు వేయడంతో నియోజకవర్గ ప్రజల చేతులు కాయలు కాచాయన్నారు. మండలంలోని జంగాలగూడెం, ఎర్రబెల్లిలో రూ.7.5లక్షలతో నిర్మించే రెండు కమ్యూనిటీ హాళ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ నోముల నర్సింహయ్య, బడుగుల లింగయ్యయాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు నూకల వెంకట్‌రెడ్డి, ఎంపీపీ దాసరి నర్సింహ, కేవీ రామారావు, అంకతి వెంకటరమణ, మన్నెం రంజిత్‌యాదవ్, సర్పంచ్ తాటి సత్యపాల్, ఎంపీటీసీ మన్నెం వెంకటరమణ, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, ఎంపీడీఓ వెంకటాచారి, మేరెడ్డి వెంకట్‌రెడ్డి, సూలకంటి వీరారెడ్డి, గడ్డం రవీందర్‌రెడ్డి, మంజుల సీతారాములు, బైరెడ్డి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ అసెంబ్లీలో రగడ..!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ అంశం అసెంబ్లీ సమావేశాలను కుదిపేసింది. నిరుద్యోగ అంశంపై చర్చకు పట్టుబడుతూ తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. ఉద్యోగాల భర్తీపై వెంటనే చర్చ చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు కోరగా.. స్పీకర్ ఇందుకు అనుమతించలేదు. ఈ అంశంపై అధికార-ప్రతిపక్షాల వాగ్వాదంతో గందరగోళం నెలకొంది. నిరుద్యోగ అంశంపై నిరసన తెలిపే అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి స్పీకర్‌ను కోరారు. సభ నడిచేందుకు సహకరించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అధికార పక్షం నుంచి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సిద్ధంగా ఉన్నామని, ఈ విషయమై సభలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. ఈ గందరగోళం నడుమ తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. మరోవైపు బీజేవైఎం కార్యకర్తల అరెస్టు నిరసనగా బీజేపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనపై సీఎం కేసీఆర్ స్పందించారు. పబ్లిసిటీ కోసం సభలో హంగామ చేయడం సరికాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు. నిరుద్యోగ సమస్యపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
హామీలు.. రైతు సమస్యలే ఎజెండా
-
హామీలు.. రైతు సమస్యలే ఎజెండా
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్ సర్కార్‌ను నిలదీయడానికి ప్రతిపక్ష కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ప్రభుత్వం రైతులకిచ్చిన హామీల అమలులో వైఫల్యం, రైతుల సమస్యలు, వివిధ పథకాల్లో అవినీతి, అక్రమాలను ఎజెండాగా చేసుకోవాలని సీఎల్పీ నిర్ణయించింది. కాంగ్రెస్ శాసనసభాపక్షనేత కె.జానారెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన సీఎల్పీ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రైతుల రుణమాఫీ అమల్లో వైఫల్యం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో అవినీతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నిర్ణయించారు. అలాగే శాంతిభద్రతలు, అట్రాసిటీ కేసులు, నయీం కేసు, మియాపూర్ భూముల కుంభకోణం, డ్రగ్స్ మాఫియాపై ప్రభుత్వ అసమర్థతను, ఆశ్రిత పక్షపాతాన్ని ఎండగట్టాలని నేతలు నిర్ణయించారు. వీటితోపాటే నిరుద్యోగాన్ని రూపుమాపడానికి, విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంటును అమలుచేయడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న అంశాన్ని తేల్చాలని సీఎల్పీ భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం అంశాలపై నిలదీయనుంది. గొర్రెలు, చేప పిల్లల పంపిణీలో లోపాలు, స్వయం సహాయక సంఘా లు, ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించకపోవడంపైనా సభలో పోరాడాలని కాంగ్రెస్‌పార్టీ నిర్ణయించింది. శాంతియుతంగా ‘చలో అసెంబ్లీ’ : జానారెడ్డి రైతుల సమస్యల పరిష్కారంకోసం నిర్వహిస్తున్న చలో అసెంబ్లీని శాంతియుతంగా నిర్వహించే బాధ్యత తమదేనని సీఎల్పీ నేత కె.జానారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, జి.చిన్నారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్, రామ్మోహన్‌రెడ్డితో కలసి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. రాష్ట్రంలో రైతాంగానికి రుణమాఫీని ఒకేసారి చేయకపోవడంతో రైతులు అప్పుల పాలయ్యారని పేర్కొన్నారు. వివిధ సమస్యలతో రైతులు ఆందోళన చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో రైతు సమస్యల తీవ్రతను ప్రభుత్వానికి చెప్పా లనే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రైతులకు నిరసన చెప్పేహక్కు లేకుండా గృహనిర్బంధాలకు దిగడం, అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. -
మీ స్థాయికి మేం దిగజారలేం: జానా
హైదరాబాద్: వరంగల్ కార్పొరేటర్ మురళి హత్య కేసులో కాంగ్రెస్ నేత నాయిని రాజేందర్ రెడ్డిని ఇరికించడాన్ని కె.జానారెడ్డి ఖండించారు. సోమవారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడారు. రాజేందర్ రెడ్డికి హత్యతో ఎటువంటి సంబంధం లేదని, నిందితులు ఎక్కడా ఆయన పేరు కూడా చెప్పలేదని జానారెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇలా వ్యవహరించటం అన్యాయం, అక్రమమన్నారు. రాజకీయ వైరుధ్యం ఉన్నంత మాత్రాన హత్యతో సంబంధం ఉందని ఆరోపించటం రాజకీయంగా కక్ష తీర్చుకోవడమేనని చెప్పారు. 1972లో తనని కూడా ఇలానే ఓ కేసులో ఇన్వాల్వ్ చేశారని గుర్తు చేశారు. కానీ కోర్టు అది అక్రమ కేసు అని తీర్పు చెప్పింది. రాజేందర్‌రెడ్డి విషయంపై డీజీపీకి వివరించి, న్యాయం చేయమని కోరానన్నారు. ఇలాంటి చర్యలు కొనసాగితే ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజు వస్తుందని ఆయన అన్నారు. వరంగల్ కాంగ్రెస్ నేత రాజేందర్ రెడ్డికి టీఆర్ఎస్ కార్పొరేటర్ హత్యతో ఎటువంటి సంబంధం లేదని స్థానిక టీఆర్ఎస్ నాయకులు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్లిందని ఆయన తెలిపారు. ఇట్లా చేస్తే బాగుండదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంస్కారం లేని నాయకుల స్థాయికి తాము దిగజారమని తెలిపారు. -
జానా కాగితం పులి మాత్రమే
నాగార్జునసాగర్ : సీఎల్పీ నేత, సీనియర్ శాసనసభ్యుడు కె జానారెడ్డిపై టీఆర్ఎస్ నాయకుడు నోముల నర్సింహయ్య విరుకుపడ్డారు. జానారెడ్డి ఒక కాగితం పులి లాంటి వారని విమర్శించారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జానారెడ్డి రైతుల కోసం ఏమీ చేయలేకపోయారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరుతడుల ద్వారా సాగర్ ఆయకట్టుకు రెండు పంటలకు నీరిచ్చి రైతులకు అండగా నిలిచారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే సాధమయ్యేనా అని ప్రశ్నించారు. ఎన్నో సంవత్సరాలుగా మంత్రిగా ఉన్న జానారెడ్డి ఒక్కసారైనా ఎడమకాల్వపై పర్యటించారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ 16 వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్బంగా నిర్వహిస్తున్న వరంగల్ భహిరంగసభ చరిత్ర సృష్టిస్తుందని తెలిపారు. సంవత్సరానికి రెండు పంటలకు సంబంధించి 8 వేల రూపాయలు ఇస్తానని ప్రకటించడం పట్ల రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. అదే విధంగా యాదవులు, నాయీబ్రాహ్మణులు, గిరిజనులు, ముస్లింలు సైతం ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. సంతోషాన్ని వరంగల్ సభకు భారీగా రావడం ద్వారా వారు తెలుపనున్నారన్నారు. నియోజకవర్గంలో 57వేలకు పార్టీ సభ్యత్వాలు చేరాయని, చేరిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా వరంగల్ బహిరంగ సభ పోస్టర్‌ను వారు విడుదల చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కేవీ రామారావు, పగిల్ల సైదులు, అంకతి వెంకటరమణ, రాం అంజయ్యయాదవ్, బొల్లం శ్రీను, బొల్లం రవి, కావేటి రాము, మన్నెం రంజిత్ యాదవ్, పరమేష్, సుజయ్, కేశబోయిన జానయ్య, పిల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. -
'సోనియా తలుచుకుంటే కేసీఆర్ ఎంత?'
⇒ ఆయన ఉద్యమం పాకిస్తాన్‌తో చేసిన యుద్ధం కంటే ఎక్కువా? ⇒ ప్రజల ఆకాంక్షను గౌరవించే రాష్ట్ర విభజన ⇒ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి మిర్యాలగూడ : కాంగ్రెస్ సీఎల్పీ నేత జానారెడ్డి తొలిసారిగా టీఆర్ఎస్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. తన మాటలకు పదునుపెట్టి సీఎం కేసీఆర్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నాడు యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ తలుచుకుంటే కేసీఆర్ ఎంతటి వాడని, ఆయన ఉద్యమం.. పాకిస్తాన్‌తో చేసిన యుద్ధం కంటే ఎక్కువా అని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షను గౌరవించి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తుచేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. అభివృద్ధి కూడా రోజు రోజుకూ దిగజారుతోందని జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సర్వేలు బలంగా ఉంటే ఇతర పార్టీల వారెందుకు.. రాష్ట్రంలో టీఆర్ఎస్ బలంగా ఉందని సర్వేల్లో వెల్లడైందని చెబుతున్న ఆ పార్టీ నాయకులు ఇతర పార్టీల వారిని ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. సర్వేల పేరుతో లేని బలాన్ని ఉన్నట్లుగా చూపి ప్రజలను గోల్మాల్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలులో ప్రభుత్వానికి విశ్వసనీయత లేదన్నారు. డబుల్ బెడ్రూమ్ పథకం వస్తుందని పేద ప్రజలను ఊరిస్తున్నారే తప్ప అమలు చేయడం లేదని విమర్శించారు. రుణమాఫీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌పై ధరఖాస్తులు స్వీకరించి రాష్ట్రపతికి అందజేయనున్నట్లు జానారెడ్డి తెలిపారు. -
'చారిత్రక ఒప్పందం కాదు.. చారిత్రక ద్రోహం'
⇒ ఎత్తు తగ్గించి మహారాష్ట్రకు తాకట్టుపెట్టారు ⇒ మహారాష్ట్ర ఒప్పందంపై టీపీసీసీ నిరసన ⇒ ఉత్తమ్, జానా, భట్టి, పొన్నాల ధర్నా హైదరాబాద్: మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్నది చారిత్రక ఒప్పందం కాదని, తెలంగాణ భావితరాలకు శాశ్వత, మహా ద్రోహమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించుకుంటూ మహారాష్ట్ర ప్రభుత్వంతో ముంబయిలో ఒప్పందం చేసుకుంటున్నందుకు రాష్ట్రవ్యాప్తంగా టీపీసీసీ మంగళవారం నిరసనలను చేపట్టింది. ధర్నాలు, నల్లజెండాలు, నల్లబ్యాడ్జీలతో జిల్లా కేంద్రాల్లో వ్యక్తమైన నిరసనల్లో భాగంగా హైదరాబాద్‌లో ముఖ్యనేతలు పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్షనేత కె.జానారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, వివిధ అనుబంధసంఘాల అధ్యక్షులు, మాజీమంత్రులు, మాజీ ఎంపీలు గాంధీభవన్ నుంచి జిల్లా కలెక్టరేట్ దాకా పాదయాత్ర నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రారంభానికి ముందు గాంధీభవన్‌లో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాణహిత ప్రాజెక్టుకోసం తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు, భావితరాలకు శాశ్వతద్రోహం చేసేవిధంగా 148 మీటర్ల ఎత్తుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తుకోసం ఒప్పందం చేసుకోవాలనుకుంటే ఇప్పుడు దానికంటే ఎక్కువ చేసుకున్నారా అని ప్రశ్నించారు. ఎత్తును తగ్గించి ఒప్పందం చేసుకుని సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని ఉత్తమ్ విమర్శించారు. 148 మీటర్ల ఎత్తుకు ఒప్పందం చేసుకోవడం ద్వారా తెలంగాణ ప్రజల భవిష్యత్తును మహారాష్ట్ర ప్రభుత్వానికి తాకట్టుపెట్టారని ఆరోపించారు. ఈ ఒప్పందం చేసుకున్నందుకు మహారాష్ట్రలోనే సంబరాలు చేసుకుంటున్నారని చెప్పారు. కనీసం ఎత్తును 152 కంటే పెంచకున్నా, అదే ఎత్తుకు ఒప్పందం చేసుకుని, సంబరాలు జరుపుకుంటే ఒక అర్థం ఉండేదన్నారు. మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. గోదావరి నదీ జలాలకోసం గతంలోనే ఒప్పందాలు జరిగాయన్నారు. 1975 నుంచి 2012 వరకు జరిగిన ఒప్పందాలపై కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం కొనసాగింపుగా ఒప్పందాలు చేసుకుందన్నారు. ప్రాజెక్టు ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించి సంబరాలు చేసుకోవడం ఎందుకని భట్టి ప్రశ్నించారు. ప్రతిపక్షనాయకుడు కె.జానారెడ్డి మాట్లాడుతూ.. మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం కాదని, చారిత్రక ద్రోహమని విమర్శించారు. బంగారు తెలంగాణ చేస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నదని విమర్శించారు. ఈ ఒప్పందం వల్ల తెలంగాణను మోసం చేస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. తెలంగాణకు శాశ్వతంగా నష్టం తప్ప ప్రయోజనం ఏమీలేదన్నారు. ఈ ఒప్పందాన్ని చారిత్రక ఒప్పందం అంటూ టీఆర్ఎస్ నేతలు తమను తాము మోసం చేసుకుంటూ, ప్రజలను మోసం చేస్తున్నారని పొన్నాల ఆరోపించారు. -
వెంటనే హైకోర్టు విభజన చేయాలి
సీఎల్పీ నేత కె.జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించి, తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టును ఏర్పాటు చేయాలని సీఎల్పీ నేత కె.జానారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పాటై రెండేళ్లు పూర్తయినా హైకోర్టు విభజనలోజాప్యం కారణంగా తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. హైకోర్టు విభజన మొదలుకుని జడ్జీల నియామకం, పదోన్నతుల దాకా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని జానా సూచించారు. హైకోర్టు విభజన కోసం న్యాయవాదులు నెలకుపైగా చేస్తున్న ఆందోళనకు పూర్తి మద్దతిస్తున్నట్లు చెప్పారు. జడ్జీలపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
జానారెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష భేటీ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్ లో కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష భేటీ ప్రారంభమైంది. టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు, బీజేపీ పక్షనేత లక్ష్మణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శివకుమార్ లు ఈ భేటీలో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన తీరు, ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై చర్చించనున్నట్లు సమాచారం. అఖిలపక్ష నేతల భేటీ అనంతరం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను ఈ నేతలు కలిసే అవకాశాలు ఉన్నాయి. ఎంఐఎం నేతలు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తదితర నేతలపై దాడులకు పాల్పడ్డ విషయం విదితమే. -
బ్రాండ్ కాదు డామేజ్ హైదరాబాద్: షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: గొల్కొండ, చార్మినార్ వంటి చారిత్రక కట్టడాలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం తగ్గుతుంటే మంత్రి కేటీఆర్ మాత్రం బ్రాండ్ హైదరాబాద్ అంటూ అబద్ధాలు మాట్లాడుతున్నాడని మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ విమర్శించారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఇచ్చిన నివేదికలో ఇప్పటిదాకా తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల జాబితా నుంచి హైదరాబాద్‌ను తొలగించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ఎందుకు దాస్తున్నాడని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాండ్ హైదరాబాద్.. డామేజ్ హైదరాబాద్ అయిందన్నారు. -
'కేసీఆర్ నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారు'
హైదరాబాద్ : ఎమ్మెల్సీల గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ అడ్డదారులు తొక్కిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు కె జానారెడ్డి, షబ్బీర్ అలీ ఆరోపించారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బుధవారం హైదరాబాద్‌లో కె జానారెడ్డి, షబ్బీర్ అలీ స్పందించారు. టీఆర్ఎస్ ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడినా.. రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్నామని తెలిపారు. సందర్భాన్ని బట్టి ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని వారు స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ, లెఫ్ట్ పార్టీలతో పొత్తుపై ఇప్పుడే చెప్పలేమని జానారెడ్డి, షబ్బీర్ అలీ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారని వారు విమర్శించారు. -
'స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ సభనుంచి వెళ్లను'
హైదరాబాద్ : రైతుల రుణాలను ఒకే దఫాలో మాఫీ చేయాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వాన్ని సభలో కాంగ్రెస్ పక్షనేత కె.జానారెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా బుధవారం జరుగుతున్న సభలో జానారెడ్డి మాట్లాడుతూ.. ఈ విషయంపై కేసీఆర్ సర్కార్ స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకూ శాసనసభ నుంచి వెళ్లేది లేదని పేర్కొన్నారు. రైతుల రుణమాఫీపై సీఎం కేసీఆర్ ను అడిగి సంబంధితశాఖ మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనంటూ తేల్చిచెప్పారు. -
నా స్టైల్లో నేనుంటా.. నాకు పోలిక తగదు
తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తన స్టైల్లో తాను వ్యవహరిస్తానని, తనను వేరొకరితో పోల్చడం తగదని అసెంబ్లీలో విపక్షనేత జానారెడ్డి అన్నారు. తన స్థాయికి తగినట్లు హుందాగా వ్యవహరిస్తానని, ప్రభుత్వంపై తనది మెతక వైఖరి అనడం సరికాదని చెప్పారు. ఎవరి కోసమో తాను దూకుడుగా వ్యవహరించబోనన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పార్టీ ఫిరాయింపులపై స్పీకర్, ఛైర్మన్ స్పందించాలని, దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నామని జానారెడ్డి అన్నారు. సీఎల్పీలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని తెలిపారు. మంత్రి జగదీశ్ రెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. -
త్రిశంకు స్వర్గంలో జానా భవిత: జగదీశ్‌రెడ్డి
విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా నల్లగొండ: సీఎల్పీ నేత కె.జానారెడ్డి రాజకీయ భవిష్యత్, త్రిశంకుస్వర్గంలో ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై జానా చేసిన విమర్శలకు ఆయన స్పందించారు. ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో జానారెడ్డి కనీసం నియోజకవర్గ ప్రజలను కూడా పట్టించుకోలేదన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఆంధ్రులకు అంకితం చేసినట్లుగానే వ్యవహరించారని ఆరోపించారు. ఉస్మానియా విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి, కాల్పుల కేసుల విషయంలోనూ నోరు మెదపని ఆయన ఇప్పుడు తెలంగాణ విద్యార్థుల భవిష్యత్ గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. త్వరలో ఎంసెట్ కౌన్సెలింగ్ తెలంగాణ విద్యార్థుల కోసం ఎంసెట్ కౌన్సెలింగ్ త్వరలో నిర్వహిస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఎవరి కౌన్సెలింగ్ వారు నిర్వహించుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు. రుణమాఫీ విషయమై రైతులెవరూ ఆందోళన చెందవద్దని కోరారు.