నా స్టైల్లో నేనుంటా.. నాకు పోలిక తగదు | i will be following my own style, says k janareddy | Sakshi
Sakshi News home page

నా స్టైల్లో నేనుంటా.. నాకు పోలిక తగదు

Published Wed, Feb 25 2015 3:48 PM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM

నా స్టైల్లో నేనుంటా.. నాకు పోలిక తగదు - Sakshi

నా స్టైల్లో నేనుంటా.. నాకు పోలిక తగదు

తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తన స్టైల్లో తాను వ్యవహరిస్తానని, తనను వేరొకరితో పోల్చడం తగదని అసెంబ్లీలో విపక్షనేత జానారెడ్డి అన్నారు. తన స్థాయికి తగినట్లు హుందాగా వ్యవహరిస్తానని, ప్రభుత్వంపై తనది మెతక వైఖరి అనడం సరికాదని చెప్పారు. ఎవరి కోసమో తాను దూకుడుగా వ్యవహరించబోనన్నారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పార్టీ ఫిరాయింపులపై స్పీకర్, ఛైర్మన్ స్పందించాలని, దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నామని జానారెడ్డి అన్నారు. సీఎల్పీలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని తెలిపారు. మంత్రి జగదీశ్ రెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement