సీఎల్పీ నేత కె.జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించి, తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టును ఏర్పాటు చేయాలని సీఎల్పీ నేత కె.జానారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పాటై రెండేళ్లు పూర్తయినా హైకోర్టు విభజనలోజాప్యం కారణంగా తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.
హైకోర్టు విభజన మొదలుకుని జడ్జీల నియామకం, పదోన్నతుల దాకా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని జానా సూచించారు. హైకోర్టు విభజన కోసం న్యాయవాదులు నెలకుపైగా చేస్తున్న ఆందోళనకు పూర్తి మద్దతిస్తున్నట్లు చెప్పారు. జడ్జీలపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.