
'స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ సభనుంచి వెళ్లను'
హైదరాబాద్ : రైతుల రుణాలను ఒకే దఫాలో మాఫీ చేయాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వాన్ని సభలో కాంగ్రెస్ పక్షనేత కె.జానారెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా బుధవారం జరుగుతున్న సభలో జానారెడ్డి మాట్లాడుతూ.. ఈ విషయంపై కేసీఆర్ సర్కార్ స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకూ శాసనసభ నుంచి వెళ్లేది లేదని పేర్కొన్నారు. రైతుల రుణమాఫీపై సీఎం కేసీఆర్ ను అడిగి సంబంధితశాఖ మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనంటూ తేల్చిచెప్పారు.