సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా సీనియర్ సభ్యుడని, ఆయనకు సభా వ్యవహారాలు తెలుసని అన్నారు. సభా నాయకుడికి అనుభవం లేదని కేటీఆర్ మాట్లాడటం సరికాదని అన్నారు బీజేపీకి కోపం వస్తుందని కేటీఆర్ అసలు విషయాన్ని వదిలేసి అన్నీ మాట్లాడారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే బీఆర్‌ఎస్‌కు రాజకీయ ప్రమోజనాలు ముఖ్యమని మండిపడ్డారు.
ఏడు మండలాల గురించి మీరు ఏం చేశారని, ఏడు మండలాల విషయం లేకుండానే ఏపీ పునర్విభజన బిల్లు పాస్ అయ్యిందని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. ఢిల్లీలో యుద్ధం చేస్తామన్నారు చేశారా? కనీసం మాట అయినా అడిగారా? అని ప్రశ్నించారు. రూ. 8 వేల కోట్లుఖర్చు చేసినా ఖమ్మం జిల్లాకు నీరు ఇవ్వలేదని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో మూసీ, మెట్రోకు నిధులు ఇవ్వలేదని, తాము అడుగుతన్నవి హక్కుగా రావాల్సిందేనని చెప్పారు.
మేం బీజేపీతో కలవడమేంటి?
రాజకీయాలు పక్కనపెట్టి సర్కార్‌తో కలిసి రావాలి. ప్రధాని మోదీని మన వాటా అడుగుదాం. ఎందుకు కేంద్రం నుంచి నిధులు రావో చుద్దాం. తెలంగాణకు అన్యాయం జరగడంపై తీర్మానం పెట్టాలి. ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేస్తున్న అన్ని పార్టీల ఆలోచన పరిగణలోకి తీసుకొని రెవల్యూషన్ తీసుకురావాలి. అన్ని పార్టీలతో కలిసి కేంద్రం వద్దకు వెళ్దాం. తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నిద్దాం.
కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల తీవ్రమైన నష్టం జరుగుతుంది.
ఆ నష్టాన్ని పూడ్చడానికి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టింది.
చర్చకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరాం.
బీజేపీ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుల సహాయం సహకారం మాకు అందరం లేదు అనిపిస్తుంది.
ప్రధాన ప్రతిపక్షం అయిన బీఆర్ఎస్ ఈ నష్టం గురించి గట్టిగా వాదిస్తుంది అనుకున్నాం.
బీజేపీ, బీఆర్‌ఎస్ రాజకీయాలు తప్ప రాబడిల గురించి మాట్లాడటం లేదు.
బీజేపీచ బీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాలు కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం నుంచి మొండిచేయి జరిగింది.
అప్పుడు సభలో అంశం పెట్టి వదిలేశారు.. మేము ఇప్పుడు అట్లా కాకుండా చర్చ చేస్తున్నాం.
విభజన చట్టం ద్వారా రావలసిన అంశాలు నిధులు ఈ బడ్జెట్ లో వస్తాయి అని ఆశించాం.
జాతీయ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఐటిఐ ఆర్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, అడిగాం ఇవ్వలేదు.
ఆనాడు సోనియాగాంధీ తెలంగాణకు అన్యాయం జరగద్దు అని విభజన అంశాల్లో చాలా విషయాలు పొందుపరిచారు.
ఆనాడు కాంగ్రెస్ పొందుపరిచిన అంశాలను కూడా ఈరోజు బిజెపి ఇవ్వడం లేదు.
మూసి అభివృద్ధి, మెట్రో రైలు అభివృద్ధి, డిఫెన్స్, ఫార్మా హబ్ అడిగాం ఇవ్వలేదు.
తెలంగాణ ప్రజలు కేంద్రానికి పనులు పడుతున్నారు.
హక్కు ద్వారా రావాల్సిన అంశాలు మాత్రమే అడిగాం.
కేంద్ర ప్రభుత్వ ఆలోచనలపై రాష్ట్రాలు పునరాలోచన చేస్తున్నాయి.
రాష్ట్రాలు దేశం గురించి ఆలోచిస్తున్నప్పటికీ... దేశం రాష్ట్రాల గురించి ఆలోచన చేయడం లేదు.
దేశాన్ని పాలించే బిజెపి రాజకీయ అవసరాల కోసం పనిచేస్తుంది.
కేంద్రం నుంచి ఏమైనా నిధులు వస్తాయేమో మన బడ్జెట్ మరింత పెరుగుతుంది అనుకున్నాం.
గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిందే ఇప్పుడు కేంద్రం సహాయం చేస్తుంది.
ఇప్పుడు కేంద్రం నుంచి ఎలాంటి సహాయం రాలేదు.
సింగరేణి విషయంలో కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి వేలం పాట వేసేందుకు కారణం గత ప్రభుత్వమే.
బీజేపీ ప్రభుత్వానికి ఐదేళ్లపాటు రాష్ట్ర బీఆర్ఎస్ మద్దతు పలికింది.
ఏడు మండలాలు ఏపీకి పోతుంటే గత కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలేదు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏడు మండలాలు ఏపీకి ధారా దత్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment