సాక్షి, ఖమ్మం: బొగ్గు గనుల ప్రైవేట్ పరంపై బీజేపీ బిల్ పెడితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓటేసి మద్దతు ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బిల్‌కు ఆమోదం చెప్పిన బీఆర్‌ఎస్ నేడు కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. గురువారం ఆయన ఖమ్మంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సింగరేణి బొగ్గు బావి వేలం పాటలో పాల్గొనకుండా సింగరేణి సంస్థకు నష్టం తీసుకుని వచ్చేలా బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందని ధ్వజమెత్తారు.
బొగ్గు బావులు వేలంలో పక్క వాళ్లకు వెళ్లకుండా అడ్డుకోలేకపోయిన బీఆర్‌ఎస్.. గోదావరి లోయలోని బొగ్గుగనులు తీసుకోవద్దని బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.. తమ అనుచర కాంట్రాక్టర్ల కోసమే బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్ వల్లనే రెండు బొగ్గు గనుల ప్రభుత్వానికి రాకుండా పోయాయి’’ అని భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు.
తెలంగాణ మీద ప్రేమ వున్నట్లు గా మాట్లాడుతున్న బొగ్గు మంత్రి కిషన్ రెడ్డి.. శ్రావణపల్లి బొగ్గు వేలం కాకుండా చూడాలి.. తెలంగాణ ఆస్తులను కాపాడాలి. అన్ని పార్టీల తో కలసి ప్రధాన మంత్రి వద్దకు వెళ్తాం. తెలంగాణను పదేళ్లు నాశనం చేసిన బీఆర్‌ఎస్ ఇంకా అలానే వ్యవహరించాలని చూస్తుంది. సింగరేణి వేలంపై కేసీఆర్, కేటీఆర్‌లతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం’’ అని భట్టి విక్రమార్క సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment