సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 9వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పషతనిచ్చారు.
ఈ సమావేశాల్లో పలు కీలక చట్టాల ఆమోదానికి రేవంత్ సర్కారు ప్లాన్ చేస్తోంది. ఆర్‌ఓఆర్ చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించాలని చూస్తోంది. రైతు, కుల గణన సర్వేపై చర్చించే అవకాశం ఉంది.డిసెంబర్ 7వ తేదీతో రేవంత్ సర్కార్ ఏడాది కాలం పూర్తి చేసుకోనుంది. దీంతో మంత్రివర్గ విస్తరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వినిపిస్తోంది. మరోవైపు పంచాయతీ ఎన్నికలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు వెళ్ళక ముందే ఆసరా పెన్షన్, రైతు భరోసా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment