న్యూఢిల్లీ: మోదీ మూడోసారి ప్రమాణస్వీకారానికి ఎందరో అతిథులు విచ్చేయనున్నారు. ఆదివారం(జూన్9) జరిగే ఈ కార్యక్రమానికి కనీవినీ ఎరుగని రీతిలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మోదీ ప్రమాణస్వీకారోత్సవంలో కొన్ని ప్రత్యేకతలుండటంతో పాటు కొంత మంది ప్రత్యేక అతిథులు కూడా హాజరుకానున్నారు.
కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్తా నిర్మాణంలో పాల్గొన్న కూలీలు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టు, మెట్రో రైలు ప్రాజెక్టులో పనిచేసిన అధికారులతో పాటు పలువురు హిజ్రాలు, శానిటేషన్ సిబ్బంది, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తదితరులకు మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమాకి ఆహ్వానాలు అందాయి. కాగా, మోదీ ప్రమాణస్వీకారానికి పలువురు ఇతర దేశాల అధినేతలు కూడా రానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment