
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం(జూన్9) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీతో సరిగ్గా 7 గంటల 23 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయించారు.
#WATCH | Narendra Modi takes oath for the third straight term as the Prime Minister pic.twitter.com/Aubqsn03vF
— ANI (@ANI) June 9, 2024
నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ అంటూ మోదీ ప్రమాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రమాణ స్వీకారంతో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన రెండో వ్యక్తిగా మోదీ కొత్త రికార్డు క్రియేట్ చేశారు.
ఓత్ ఆఫ్ ఆఫీస్‌తో పాటు ఓత్ ఆఫ్ సీక్రెసీ ప్రమాణాన్ని మోదీతో రాష్ట్రపతి చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్,శ్రీలంక,మాల్దీవులు,మారిషస్ ప్రధానులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
పలువురు బీజేపీ అగ్ర నేతలకు మళ్లీ చోటు..
గతంలో కీలక శాఖలు నిర్వహించిన బీజేపీ అగ్ర నేతలు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, పియూష్‌గోయెల్, నిర్మలాసీతారామన్, నితిన్ గడ్కరీ జితేంద్ర సింగ్ కేబినెట్ మంత్రులుగా మూడోసారి ప్రమాణం చేశారు. బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డాను ఈసారి కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.
Amit Shah sworn in as Union minister in Prime Minister Modi's 3.0 Cabinet
Read @ANI Story | https://t.co/XtFeIoOQz1#AmitShah #Unionminister pic.twitter.com/kba9Jk43u0— ANI Digital (@ani_digital) June 9, 2024
72 మందితో మోదీ3.0 మంత్రి వర్గం.. 30 మందికి కేబినెట్ హోదా
మోదీ 3.0 ప్రభుత్వ మంత్రి వర్గంలో మొత్తం 72 మంత్రులున్నారు. వీరిలో 30 మంది కేబినెట్ మంత్రులుకాగా అయిదుగురు సహాయం(ఇండిపెండెంట్), 36 మంది సహాయ మంత్రి పదవులు దక్కాయి. కేబినెట్‌లో బీజేపీ కాకుండా ఎన్డీఏ మిత్రపక్షాలకు 11 మంత్రి పదవులు దక్కాయి. కేబినెట్‌లో సామాజిక వర్గాల వారిగా చూస్తే 20 మంది ఓబీసీలకు, కాగా, ఎస్సీలకు10,ఎస్టీలకు 6 మైనార్టీలకు 5 బెర్తులు కేటాయించారు.
30 మంది కేబినెట్ మంత్రులు వీళ్లే...
1.రాజ్‌నాథ్ సింగ్
2.అమిత్ షా
3.నితిన్ గడ్కరీ
4.జేపీ నడ్డా
5.శివరాజ్ సింగ్ చౌహాన్
6.నిర్మలా సీతారామన్
7.జై శంకర్
8.మనోహర్‌లాల్ ఖట్టర్
9.హెచ్‌డీ కుమార్ స్వామీ
10.పియూష్ గోయల్
11.ధర్మేంద్ర ప్రదాన్
12.జితిన్ రామ్ మాంజీ
13.రాజీవ్ రంజన్ సింగ్
14.శర్వానంద్ సోనోవాల్
15.వీరేంద్రకుమార్
16.కింజరపు రామ్మోహన్ నాయుడు
17.ప్రహ్లాద్ జోషి
18.జువల్ ఓరం
19.గిరిరాజ్ సింగ్
20.అశ్వినీ వైష్ణవ్
21.జ్యోతిరాధిత్య సింధియా
22.భూపేందర్ యాదవ్
23.గజేంద్ర సింగ్ షెకావత్
24.అన్నపూర్ణాదేవి
25.కిరణ్ రిజిజు
26.హర్దీప్ సింగ్‌పూరి
27.మన్‌సుఖ్ మాండవీయ
28.జి.కిషన్ రెడ్డి
29.చిరాగ్ పాశ్వాన్
30.సీఆర్ పాటిల్
తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి పదవులు..
తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి నరసాపురం ఎంపీగా గెలుపొందిన బీజేపీ నేత శ్రీనివాస వర్మ, తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగు దేశం పార్టీ తరపున కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు మంత్రి వర్గంలో చోటు దక్కింది.
మోదీ 3.0.. ఏ రాష్ట్రానికి ఎన్ని బెర్తులు..
యూపీ నుంచి 9 మందికి కేంద్ర మంత్రి పదవులు దక్కగా, మహారాష్ట్ర నుంచి ఆరుగురుకి కేంద్రమంత్రి పదవులు దక్కాయి. ఇక గుజరాత్ నుంచి ఐదుగురు, కర్ణాటక నుంచి ఐదుగురు, ఒడిశా నుంచి ముగ్గురు చోటు దక్కించుకున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు నాలుగు చొప్పున మంత్రి పదవులు, జార్ఖండ్ ,బెంగాల్ నుంచి ఇద్దరికి చొప్పున మంత్రి పదవులు, కేరళ, తమిళనాడు, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లకు ఒక్కో మంత్రి పదవి దక్కింది.