మోదీ కేబినెట్లో కొత్త మంత్రులు వీరే
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తొలిసారిగా తన కేబినెట్ను విస్తరించారు. రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ... మొత్తం 21 మంది చేత కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. వారిలో నలుగురు కేబినెట్ మంత్రులు కాగా, ముగ్గురు స్వతంత్ర హోదా గల మంత్రులు, మరో 14 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మోడీ కేబినెట్ లో మంత్రి వర్గ సభ్యుల సంఖ్య 66 కు చేరింది.
కేబినెట్ మంత్రులు:
మనోహర్ పారికర్ (గోవా)
జేపీ నడ్డా (హిమాచల్ ప్రదేశ్)
చౌదరి బీరేంద్ర సింగ్ (హర్యానా)
సురేష్ ప్రభు ( మహారాష్ట్ర)
స్వతంత్ర హోదా సహాయ మంత్రులు:
బండారు దత్తాత్రేయ (తెలంగాణ)
రాజీవ్ ప్రతాప్ రూడీ (బీహార్)
మహేశ్ శర్మ (ఉత్తరప్రదేశ్)
సహాయ మంత్రులు:
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ (ఉత్తరప్రదేశ్)
రామ్కృపాల్ యాదవ్ (బీహార్)
కల్నల్ సోనారామ్ చౌదరి ( రాజస్థాన్)
సన్వర్లాల్ జాట్ (రాజస్థాన్)
మోహన్ కుందారియా (గుజరాత్)
గిరిరాజ్ సింగ్ (బీహార్)
హన్స్రాజ్ అహిర్ (మహారాష్ట్ర)
ప్రొ.రామ్ శంకర్ కటేరియా (ఉత్తరప్రదేశ్ )
సుజనా చౌదరి (ఆంధ్రప్రదేశ్)
జయంత్ సిన్హా (జార్ఖండ్)
రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ (రాజస్థాన్)
బాబుల్ సుప్రీయో (పశ్చిమ బెంగాల్ )
సాధ్వీ నిరంజన్ జ్యోతి( ఉత్తరప్రదేశ్ )
విజయ్ సంప్లా (పంజాబ్)