minister of state
-
సహాయ మంత్రి మాకొద్దు: ఎన్సీపీ
న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ ఇవ్వజూపిన సహాయమంత్రి (స్వతంత్ర హోదా) పదవిని భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ తిరస్కరించారు. కేంద్రంలో ఇప్పటికే ఒకసారి కేబినెట్ మంత్రిగా పనిచేసిన తాను సహాయమంత్రి పదవిని తీసుకోవడం అంటే స్థాయిని తగ్గించుకోవడమేనని ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని బీజేపీ అగ్ర నాయకత్వానికి తెలపగా మరో ప్రత్యామ్నాయం దొరికే వరకు వేచి ఉండాలని తనను కోరారని వివరించారు. భవిష్యత్తులో జరిగే విస్తరణలో ఎన్సీపీకి కేబినెట్ హోదా పదవి లభిస్తుందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ చెప్పారు. పార్లమెంట్లో ఎన్సీపీకి ఇద్దరు సభ్యులున్నారు. ప్రఫుల్ పటేల్ రాజ్యసభలో, సునీల్ తత్కారే లోక్‌సభలో సభ్యులుగా ఉన్నారు. -
రియల్మీ ఫోన్లలో వ్యక్తిగత డేటా సేకరణ? స్పందించిన కేంద్రమంత్రి
చైనాకు చెందిన మొబైల్ కంపెనీ రియల్మీ ఫోన్లలోని కాల్ లాగ్‌లు, లొకేషన్ సమాచారం, ఎస్సెమ్మెస్ వంటి వినియోగదారుల వ్యక్తిగత డేటాను సేకరిస్తోందని యూజర్లు ఆరోపిస్తున్నారు. రియల్మీ ఫోన్లలోని 'మెరుగైన ఇంటెలిజెంట్ సర్వీసెస్' వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని క్యాప్చర్ చేస్తుందని, ఈ సర్వీస్ డిఫాల్ట్‌గా యాక్టివేట్ చేశారని పేర్కొంటూ ఓ యూజర్ చేసిన ట్వీట్‌కు ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. దీనిని తనిఖీ చేస్తామని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌ను కూడా ఆయన ట్యాగ్ చేశారు. ‘రియల్మీ స్మార్ట్‌ఫోన్‌లో యూజర్ డేటా (కాల్ లాగ్‌లు, ఎస్సెమ్మెస్, లొకేషన్ సమాచారం) క్యాప్చర్ చేసే ఫీచర్ (మెరుగైన ఇంటెలిజెంట్ సర్వీసెస్) ఉంది. ఇది డిఫాల్ట్‌గా 'ఆన్'లో ఉంది. సెట్టింగ్‌లు -> అదనపు సెట్టింగ్‌లు -> సిస్టమ్ సేవలు -> మెరుగుపరచబడిన ఇంటెలిజెంట్ సర్వీసెస్‌కి వెళ్లినప్పుడు డిఫాల్ట్ ఫీచర్‌గా 'ఆన్' ఉండటం చూడవచ్చు. భారతీయ వినియోగదారుల అనుమతి లేకుండా వారి డేటాను సేకరిస్తున్నారు. ఇది డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉన్నందున ఇది బలవంతపు సమ్మతి. ఈ డేటా చైనాకు పంపుతున్నారా?’ అంటూ రిషి బాగ్రీ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ సర్వీస్ ఫీచర్ సెట్టింగ్‌ల కింద లోతుగా ఉండటంతో చాలా మంది వినియోగదారులకు దాని గురించి కూడా తెలియదు. కానీ ఈ ట్వీట్‌ను ఫాలో అయిన మరికొందరు యూజర్లు వన్‌ప్లస్ ఫోన్లలో కూడా ఇలాంటి ఫీచర్‌ను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఒప్పో, వివో, రియల్మీ కంపెనీలకు మాతృ సంస్థ బీబీకే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్. వన్‌ప్లస్ బ్రాండ్ కూడా ఒప్పో అనుబంధ సంస్థే. రియల్మీ స్మార్ట్‌ఫోన్ కంపెనీ భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 14.5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. రియల్మీ ఇండియా సీఈఓ మాధవ్ సేథ్ ఇటీవలే తప్పుకున్నారు. ఉన్నట్టుండి తన పదవి రాజీనామా చేశారు. Will hv this tested and checked @rishibagree copy: @GoI_MeitY https://t.co/4hkA5YWsIg — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) June 16, 2023 -
ఆస్పత్రిలో ఫ్లోర్ తుడిచిన మంత్రి.. ‘నేనేం ఎక్కువ కాదు’
ఐజ్వాల్: కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తోంది. పేద, ధనిక తేడాలేకుండా అందరూ ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, మందుల కోసం సోషల్ మీడియాలో వినతులు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల వేళల్లో కనిపించే రాజకీయ నాయకులు ఈ కష్టకాలంలో కంటికి కనిపించడం లేదు. కానీ, ఇందుకు భిన్నంగా మిజోరం విద్యుత్ శాఖ మంత్రి ఆర్ లాల్జిర్లియానా అధికార దర్పం పక్కపెట్టి ఆస్పత్రిలో నేలను శుభ్రం చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మంత్రి ఆర్ లాల్జిర్లియానాను చూసి రాజకీయ నాయకులు కళ్లు తెరవాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. " నేను ఆసుపత్రిలో నేలను శుభ్రంచేసి వైద్యులు, నర్సులను ఇబ్బంది పెట్టాలనుకోలేదు. నా ఉద్దేశం అది కాదు. ఈ పని చేసి నేనొక ఉదాహరణగా నిలవాలి, అది ఇతరులకు అవగాహన కల్పించాలన్నదే నా ఆలోచన. మేము ఆస్పత్రిలో బాగానే ఉన్నాం. వైద్యులు, నర్సులు బాగా చూసుకుంటున్నారు." అని మంత్రి ఆర్ లాల్జిర్లియానా మీడియాతో అన్నారు. అంతేకాకుండా తానున్న గది అపరిశుభ్రంగా ఉండటంతో స్వీపర్‌కి ఫోన్ చేయగా, అటువైపు నుంచి స్పందన రాలేదని, దీంతో తానే శుభ్రం చేసినట్లు వివరించారు. "నాకు ఇలాంటి పనులు కొత్తేం కాదు. అవసరం అనుకున్నప్పుడు నేను ఇలాంటి పనులు చేస్తుంటాను. నేను మంత్రి పదవిలో ఉన్నప్పటికీ.. ఇతరుల కంటే ఎక్కువని అనుకోవట్లేదు" అని ఆయన చెప్పారు. మంత్రితో పాటు ఆయన భార్య, కుమారుడు కూడా అదే ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స పొందుతున్నారు. గత సంవత్సరం మిజోరంలోని మంత్రులు వీఐపీ సంస్కృతిని పక్కన పెట్టి ఇంటి పనులు చేయడం, ప్రజా రవాణా, మోటారు బైక్‌లో ప్రయాణించారు. వీరు వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం.. క్రిస్మస్ వంటి పండుగ సీజన్లో వంట మనుషులుగా పనిచేయడం ద్వారా సామాన్యులుగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. (చదవండి: వైరల్: బొమ్మతో చిరుతనే ఆటపట్టించిన చిన్నారి!) -
ఏపీకి ప్రత్యేక హోదా కన్నా ...
విజయవాడ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుపై కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి స్పందించారు. శుక్రవారం విజయవాడ వచ్చిన సుజనా చౌదరి విలేకర్లతో మాట్లాడుతూ... ఉభయ సభలలో కాంగ్రెస్ తీరు దారుణంగా ఉందని ఆ పార్టీపై నిప్పులు చెరిగారు. 20 రోజులపాటు పార్లమెంట్ జరగకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. పార్లమెంట్ నడిచి ఉంటే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వంటి అంశాలు పరిష్కారమయ్యేవని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ వైఖరి వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కన్నా మెరుగైన ప్రయోజనం వచ్చేలా ప్రయత్నం చేస్తానని సుజనా చౌదరి తెలిపారు. -
'రాష్ట్రానికి సాయం చేస్తామని అమిత్ షా హామీ'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి ఏపీకి అన్నివిధాలా సాయం చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హామీ ఇచ్చారని కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనాచౌదరి వెల్లడించారు. శనివారం న్యూఢిల్లీలో అమిత్ షాతో సుజనాచౌదరి భేటీ అయ్యారు. అనంతరం సుజనాచౌదరి విలేకర్లతో మాట్లాడుతూ... విభజన హామీలు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని అమిత్ షాను కోరినట్లు సుజనాచౌదరి వివరించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన సాధారణ ఆర్థిక బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక హోదా, అధిక నిధులు తదితర అంశాలు లేకపోవడంతో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రతిపక్షం, వివిధ పార్టీల నాయకులతోపాటు ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. ఏపీ ప్రత్యేక హోదా కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా పేర్కొన్న బీజేపీ నాయకులు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడంతోపాటు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమయ్యారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాజధానికి నిధులు తీసుకురావడంపై కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రత్యేక దృష్టి సారించారు. -
మోదీ కేబినెట్లో కొత్త మంత్రులు వీరే
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తొలిసారిగా తన కేబినెట్‌ను విస్తరించారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ... మొత్తం 21 మంది చేత కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. వారిలో నలుగురు కేబినెట్ మంత్రులు కాగా, ముగ్గురు స్వతంత్ర హోదా గల మంత్రులు, మరో 14 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మోడీ కేబినెట్ లో మంత్రి వర్గ సభ్యుల సంఖ్య 66 కు చేరింది. కేబినెట్ మంత్రులు: మనోహర్ పారికర్ (గోవా) జేపీ నడ్డా (హిమాచల్ ప్రదేశ్) చౌదరి బీరేంద్ర సింగ్ (హర్యానా) సురేష్ ప్రభు ( మహారాష్ట్ర) స్వతంత్ర హోదా సహాయ మంత్రులు: బండారు దత్తాత్రేయ (తెలంగాణ) రాజీవ్ ప్రతాప్ రూడీ (బీహార్) మహేశ్ శర్మ (ఉత్తరప్రదేశ్) సహాయ మంత్రులు: ముక్తార్ అబ్బాస్ నఖ్వీ (ఉత్తరప్రదేశ్) రామ్‌కృపాల్ యాదవ్ (బీహార్) కల్నల్ సోనారామ్ చౌదరి ( రాజస్థాన్) సన్వర్‌లాల్ జాట్ (రాజస్థాన్) మోహన్ కుందారియా (గుజరాత్) గిరిరాజ్ సింగ్ (బీహార్) హన్స్‌రాజ్ అహిర్ (మహారాష్ట్ర) ప్రొ.రామ్ శంకర్ కటేరియా (ఉత్తరప్రదేశ్ ) సుజనా చౌదరి (ఆంధ్రప్రదేశ్) జయంత్ సిన్హా (జార్ఖండ్) రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ (రాజస్థాన్) బాబుల్ సుప్రీయో (పశ్చిమ బెంగాల్ ) సాధ్వీ నిరంజన్ జ్యోతి( ఉత్తరప్రదేశ్ ) విజయ్ సంప్లా (పంజాబ్) -
రైల్వేమంత్రి బడ్జెట్.. సహాయ మంత్రి నిరసన
పార్లమెంటులో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సాక్షాత్తు రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతుంటే, అదే శాఖకు చెందిన సహాయ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి మాత్రం వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. సాధారణంగా ఒక శాఖకు చెందిన మంత్రి ఏవైనా బిల్లులు ప్రవేశపెడుతుంటేనే ఆ శాఖకు చెందిన సహాయ మంత్రులు అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండి, తోటి సభ్యుల ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయో చూస్తుంటారు, అలాగే సీనియర్ మంత్రికి ఏమైనా అవసరమైతే సహాయపడుతుంటారు. కానీ బుధవారం మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన లోక్‌సభ సభ్యులతో పాటు కేంద్ర మంత్రులు కూడా తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టొద్దంటూ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. అదే జాబితాలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి కూడా ఉన్నారు. రైల్వే బడ్జెట్‌ను తన సీనియర్ మంత్రి ప్రవేశపెడుతున్నా దానికంటే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడం, నిరసన తెలియజేయడమే ముఖ్యంగా భావించారు. దాంతో తోటి సీమాంధ్ర ఎంపీలు, మంత్రులతో కలిసి తాను సైతం వెల్‌లోకి దూసుకెళ్లారు. సీమాంధ్ర ఎంపీలతో పాటు డీఎంకే, అన్నాడీఎంకేలకు చెందినవారు కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించడంతో అచ్చం మన రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లాగే రైల్వే బడ్జెట్ కూడా పది నిమిషాల్లోనే ముగించి, మిగిలినది కూడా చదివినట్లు భావించాలని చెప్పి వదిలేశారు. బడ్జెట్ ప్రతులను మాత్రం సభ్యులందరికీ పంచిపెట్టారు!!