
న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ ఇవ్వజూపిన సహాయమంత్రి (స్వతంత్ర హోదా) పదవిని భాగస్వామ్య పార్టీ ఎన్‌సీపీ నేత ప్రఫుల్ పటేల్ తిరస్కరించారు. కేంద్రంలో ఇప్పటికే ఒకసారి కేబినెట్ మంత్రిగా పనిచేసిన తాను సహాయమంత్రి పదవిని తీసుకోవడం అంటే స్థాయిని తగ్గించుకోవడమేనని ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు.
ఇదే విషయాన్ని బీజేపీ అగ్ర నాయకత్వానికి తెలపగా మరో ప్రత్యామ్నాయం దొరికే వరకు వేచి ఉండాలని తనను కోరారని వివరించారు. భవిష్యత్తులో జరిగే విస్తరణలో ఎన్‌సీపీకి కేబినెట్ హోదా పదవి లభిస్తుందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ చెప్పారు. పార్లమెంట్‌లో ఎన్‌సీపీకి ఇద్దరు సభ్యులున్నారు. ప్రఫుల్ పటేల్ రాజ్యసభలో, సునీల్ తత్కారే లోక్‌సభలో సభ్యులుగా ఉన్నారు.