
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్‌లో గురువారం సాయంత్రం జరిగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ హాజరుకావడం లేదు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమల కారణంగా మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం లేదని వారు వెల్లడించారు.
ఇక రెండో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్ర మోదీకి భూపేష్ బాఘేల్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేక పోతున్నానని పేర్కొన్నారు. మరోవైపు తమ మంత్రివర్గ సహచరుల ప్రమాణ స్వీకారం కూడా గురువారం ఉన్నందున తాను ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం లేదని ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment