ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 30వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు శర వేగంగా సాగుతున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనే వారి కోసం ఐదు రకాలు పాసులు జారీచేస్తున్నట్టు తెలిపారు. ఎవరికి కేటాయించిన సీట్లలో వారే కూర్చోవాలని సూచించారు.