
చంద్రబాబు వెళ్తారా?
కొత్తగా ఏర్పడుతున్న తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఒకప్పటి తన మంత్రివర్గ సహచరుడు కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరవుతారా?
కొత్తగా ఏర్పడుతున్న తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఒకప్పటి తన మంత్రివర్గ సహచరుడు కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరవుతారా? పదమూడు జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆయన.. ఈ ప్రమాణస్వీకారానికి హాజరు కాకపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయనకు కేవలం అధికార యంత్రాంగం నుంచి సాధారణంగా మాత్రమే ఆహ్వానం అందింది తప్ప టీఆర్ఎస్ నాయకులెవ్వరూ కనీసం ఫోన్లోనైనా స్వయంగా ఆహ్వానించలేదని, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రితో వ్యవహరించే తీరు సరిగా లేదని భావించడం వల్లే ఆయన గైర్హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది.
ఎటూ తెలంగాణ సీఎం ప్రమాణస్వీకారానికి హాజరు కావట్లేదు కాబట్టి, తన ప్రమాణ స్వీకారం, కొత్త ప్రభుత్వ ఏర్పాటు, కొత్త యంత్రాంగం తదితర అంశాలపై చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. కొత్త సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు తదితరులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో ఈనెల 8వ తేదీ రాత్రి చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తున్న విషయం తెలిసిందే.