విజయవాడలో రేపు ట్రాఫిక్‌ మళ్లింపు | Police To Impose Traffic Restrictions For Chandrababu Naidu Swearing-in Ceremony | Sakshi
Sakshi News home page

విజయవాడలో రేపు ట్రాఫిక్‌ మళ్లింపు

Published Tue, Jun 11 2024 1:08 PM | Last Updated on Tue, Jun 11 2024 1:14 PM

Police To Impose Traffic Restrictions For Chandrababu Naidu Swearing-in Ceremony

గాందీనగర్‌(విజయవాడసెంట్రల్‌): నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 12న ట్రాఫిక్‌ మళ్లించినట్లు పోలీసు కమిషనర్‌ పీహెచ్‌డీ రామకృష్ణ తెలిపారు. విజయవాడ నగరం నుంచి గన్నవరం వైపు వెళ్లు వాహనాల రాకపోకలకు అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్‌ మళ్లించామన్నారు.  ఆ వివరాలు ఇవి.. 

విజయవాడ నగరంలో సాధారణ వాహనాలు..  
👉 విజయవాడ నుంచి ఏలూరు, విశాఖపట్నం వైపు వెళ్లే కార్లు, ద్విచక్ర వాహనాలు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బెంజ్‌ సర్కిల్‌ నుంచి కంకిపాడు–పామర్రు–హనుమాన్‌ జంక్షన్‌–ఏలూరు వైపు వెళ్లాల్సి ఉంటుంది.  
విజయవాడ వెలుపల ట్రాన్స్‌పోర్టు వాహనాలు..  
👉 విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వైపు వచ్చు వాహనాలు.. హనుమాన్‌ జంక్షన్‌ వద్ద నుంచి నూజివీడు, జి. కొండూరు, ఇబ్రహింపట్నం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అటు నుంచే వాహనాలు కూడా అదే మార్గం గుండా రావాలి.  
👉 విశాఖపట్నం నుంచి చెన్నై వైపు వెళ్లు వాహనాలు.. హనుమాన్‌ జంక్షన్‌ వద్ద నుంచి గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, పెనుముడి వారధి రేపల్లె, బాపట్ల, త్రోవగుంట ఒంగోలు మీదుగా వెళ్లాలి. 
👉 చెన్నై నుంచి విశాఖపట్నం వైపునకు వచ్చే వాహనాలు.. ఒంగోలు, త్రోవగుంట, బాపట్ల, రేపల్లె, పెనుముడి వారధి, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా వెళ్లాలి.  
👉 చెన్నై నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలు.. మేదరపెట్ల, అద్దంకి, నరసరావుపేట, పిడుగురాళ్ల, మిర్యాలగూడెం, నల్గొండ నుంచి వెళ్లాలి.  
👉 హైదరాబాద్‌ నుంచి గుంటూరు వైపు వచ్చే వాహనాలు.. నల్గొండ, మిర్యాలగూడెం, దాచేపల్లి, పిడుగురాళ్ల, నరసరావుపేట, అద్దంకి, మేదరమెట్ల నుంచి వెళ్లాలి 
ఆర్టీసీ బస్సుల మళ్లింపు ఇలా.. 
👉 విజయవాడ ఏలూరు వైపు వెళ్లు బస్సులు.. పీఎన్‌బీఎస్‌ నుంచి ఓల్డ్‌ పీసీఆర్‌ జంక్షన్, ఏలూరు రోడ్, హోటల్‌ స్వర్ణ పాలెస్, చుట్టుగుంట, గుణదల, రామవరప్పాడు రింగ్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్, నున్న బైపాస్, నూజివీడు, హనుమాన్‌ జంక్షన్, ఏలూరు వైపు వెళ్లాలి. 
👉 విజయవాడ రామవరప్పాడు రింగ్‌ నుంచి గన్నవరం వైపు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వెళ్లే వాహనాలు, అంబులెన్స్, అత్యవసర ఆరోగ్య చికిత్స వాహనాల తప్ప ఏ ఇతరవాహనాలు గన్నవరం వైపు అనుమతించరు. పాసులు ఉన్న వాహనాలను మాత్రమే అనుమిస్తారు. ట్రాఫిక్‌ మళ్లింపులను గమనించి నగర ప్రజలంతా సహకరించాలని సీపీ రామకృష్ణ కోరారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement