traffic restriction
-
HYD: రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి,హైదరాబాద్: వినాయకచవితి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్‌లో బడా గణేష్‌తో పాటు హైదరాబాద్ నగరవ్యాప్తంగా వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నందున ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు.సెప్టెంబర్ 7నుంచి 17వ తేదీ నిమజ్జనం అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు. ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుని పరిసర ప్రాంతాలు ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, మింట్‌కాంపౌండ్‌లో ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు.ఖైరతాబాద్ వినాయక విగ్రహం నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ అనుమతించలేదు.పాత సైఫాబాద్ పీఎస్ నుంచి ఖైరతాబాద్ గణేష్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ రాజ్‌దూత్ లేన్‌లోకి అనుమతించరు.ఇక్బాల్ మినార్ నుండి మింట్ కాంపౌండ్ లేన్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ అనుమంతించరు.ఎన్టీఆర్ మార్గ్/ఖైరతాబాద్ ఫ్లైఓవర్/నెక్లెస్ రోడ్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ అనుమతించరు.నెక్లెస్ రోటరీ వద్ద తెలుగు తల్లి జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు నిరంకారి నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్ఖైరతాబాద్ పోస్టాఫీసు లేన్ ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు అనుమతించరు.నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వచ్చే సందర్శకులు తమ వాహనాలను ఐమాక్స్ థియేటర్ పక్కన అంబేద్కర్ స్క్వేర్ పార్కింగ్ స్థలం, ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్ స్థలాలు, ఐమాక్స్ ఎదురుగా, సరస్వతి విద్యా మందిర్ హైస్కూల్ ప్రాంగణం, రేస్ కోర్స్ రోడ్ పార్కింగ్ ప్లేస్‌లో పార్క్ చేయాలని పోలీసులు కోరారు. -
విజయవాడలో రేపు ట్రాఫిక్ మళ్లింపు
గాందీనగర్(విజయవాడసెంట్రల్): నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 12న ట్రాఫిక్ మళ్లించినట్లు పోలీసు కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. విజయవాడ నగరం నుంచి గన్నవరం వైపు వెళ్లు వాహనాల రాకపోకలకు అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్ మళ్లించామన్నారు. ఆ వివరాలు ఇవి.. విజయవాడ నగరంలో సాధారణ వాహనాలు.. 👉 విజయవాడ నుంచి ఏలూరు, విశాఖపట్నం వైపు వెళ్లే కార్లు, ద్విచక్ర వాహనాలు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బెంజ్ సర్కిల్ నుంచి కంకిపాడు–పామర్రు–హనుమాన్ జంక్షన్–ఏలూరు వైపు వెళ్లాల్సి ఉంటుంది. విజయవాడ వెలుపల ట్రాన్స్‌పోర్టు వాహనాలు.. 👉 విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వచ్చు వాహనాలు.. హనుమాన్ జంక్షన్ వద్ద నుంచి నూజివీడు, జి. కొండూరు, ఇబ్రహింపట్నం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అటు నుంచే వాహనాలు కూడా అదే మార్గం గుండా రావాలి. 👉 విశాఖపట్నం నుంచి చెన్నై వైపు వెళ్లు వాహనాలు.. హనుమాన్ జంక్షన్ వద్ద నుంచి గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, పెనుముడి వారధి రేపల్లె, బాపట్ల, త్రోవగుంట ఒంగోలు మీదుగా వెళ్లాలి. 👉 చెన్నై నుంచి విశాఖపట్నం వైపునకు వచ్చే వాహనాలు.. ఒంగోలు, త్రోవగుంట, బాపట్ల, రేపల్లె, పెనుముడి వారధి, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లాలి. 👉 చెన్నై నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు.. మేదరపెట్ల, అద్దంకి, నరసరావుపేట, పిడుగురాళ్ల, మిర్యాలగూడెం, నల్గొండ నుంచి వెళ్లాలి. 👉 హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వచ్చే వాహనాలు.. నల్గొండ, మిర్యాలగూడెం, దాచేపల్లి, పిడుగురాళ్ల, నరసరావుపేట, అద్దంకి, మేదరమెట్ల నుంచి వెళ్లాలి ఆర్టీసీ బస్సుల మళ్లింపు ఇలా.. 👉 విజయవాడ ఏలూరు వైపు వెళ్లు బస్సులు.. పీఎన్బీఎస్ నుంచి ఓల్డ్ పీసీఆర్ జంక్షన్, ఏలూరు రోడ్, హోటల్ స్వర్ణ పాలెస్, చుట్టుగుంట, గుణదల, రామవరప్పాడు రింగ్, ఇన్నర్ రింగ్ రోడ్, నున్న బైపాస్, నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఏలూరు వైపు వెళ్లాలి. 👉 విజయవాడ రామవరప్పాడు రింగ్ నుంచి గన్నవరం వైపు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వెళ్లే వాహనాలు, అంబులెన్స్, అత్యవసర ఆరోగ్య చికిత్స వాహనాల తప్ప ఏ ఇతరవాహనాలు గన్నవరం వైపు అనుమతించరు. పాసులు ఉన్న వాహనాలను మాత్రమే అనుమిస్తారు. ట్రాఫిక్ మళ్లింపులను గమనించి నగర ప్రజలంతా సహకరించాలని సీపీ రామకృష్ణ కోరారు. -
Ramadan 2023: పాతబస్తీ, సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ మాసం ఆఖరి శుక్రవారమైన జమాత్ అల్ విదా ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీతో పాటు సికింద్రాబాద్ ప్రాంతంలోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అదనపు సీపీ (ట్రాఫిక్) జి.సుదీర్‌బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మక్కా మసీదులో జరిగే ప్రార్థనల కారణంగా ఆ సమయంలో చార్మినార్–మదీనా, చార్మినార్–ముర్గీ చౌక్, చార్మినార్–రాజేష్ మెడికల్ హాల్ (శాలిబండ) మధ్య రోడ్లు పూర్తిగా మూసి ఉంటాయి. ఈ మార్గాల్లోకి ఎలాంటి వాహనాలు అనుమతించరు. ప్రార్థనలకు హాజరయ్యే వారి కోసం గుల్జార్ ఫంక్షన్ హాల్, చార్మినార్ బస్ టెర్మినల్ పార్కింగ్, సర్దార్ మహల్ సహా ఏడు ప్రాంతాల్లో పార్కింగ్ కేటాయించారు. అదే సమయంలో సికింద్రాబాద్‌లోని సుభాష్ రోడ్ కూడా మూసేస్తారు. వాహనాలను ప్రత్యా మ్నాయ మార్గాల్లో మళ్లిస్తారు. ఈ ఆంక్షలు, మళ్లింపులు ఆర్టీసీ బçస్సులకు వర్తిస్తాయని, సహాయ సహకారాలు అవసరమైన వాళ్లు 9010203626 నంబర్లో సంప్రదించాలని సుధీర్‌బాబు సూచించారు. చదవండి: Hyderabad: ఏమా జనం!.. కిక్కిరిసిన మెట్రో.. అడుగుపెట్టే జాగ లేదు -
హమ్మయ్య.. హైదరాబాద్ వాహనదారులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో శని, ఆదివారాల్లో ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్) నిర్వహించారు. దీంతో ఇటువైపుగా వచ్చే వాహనాలను దారి మళ్లించారు. కార్ రేసింగ్ ముగియడంతో సోమవారం వాహనాలను కొత్తగా నిర్మిస్తున్న రాష్ట్ర కొత్త సచివాలయం ముందు నుంచి అనుమతించారు. రెండురోజుల పాటు ఇబ్బందులకు గురైన వాహన చోదకులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, కార్ రేసింగ్ కోసం ఈ మార్గంలో ప్రత్యేకంగా ట్రాక్‌ను నిర్మించారు. దేశంలోనే తొలి స్ట్రీట్ సర్క్యూట్ ఇండియన్ రేసింగ్ లీగ్‌ను హుస్సేన్ సాగర్ తీరంలో శని, ఆదివారాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే చెన్నై జట్టుకు చెందిన కారు ప్రమాదానికి గురికావడంతో రేసింగ్‌ను నిర్వాహకులు నిలిపివేశారు. దీంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. డిసెంబర్ 10, 11 తేదీల్లో మళ్లీ ఇక్కడ కార్ రేసింగ్ నిర్వహిస్తారు. (క్లిక్ చేయండి: రేస్ లేకుండానే ముగిసిన లీగ్...) -
విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, విజయవాడ : దసరా ఉత్సవాల సందర్భంగా ఈనెల 17 నుంచి 25వ తేదీ వరకు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగర ప్రజలకు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్ మళ్ళింపులు చేశామని ,పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామని సీపీ బత్తిన శ్రీనివాసులు అన్నారు. విజయవాడ మీదుగా ఇతరప్రాంతాలకు వెళ్లే వాహనాలకు సిటీలోకి అనుమతి లేదని తెలిపారు. విశాఖపట్నం - హైదరాబాద్ మధ్య వాహనాలు హనుమాన్ జంక్షన్ నూజివీడు-మైలవరం-జీ కొండూరు - ఇబ్రహీంపట్నం మీదుగా, విశాఖపట్నం-చెన్నై మధ్య వాహనాలు హనుమాన్ జంక్షన్-అవనిగడ్డ-రేపల్లె-బాపట్ల-చీరాల మీదుగా, గుంటూరు -విశాఖపట్నం మధ్య వాహనాలు బుడంపాడు నుంచి పొన్నూరు-రేపల్లె-అవనిగడ్డ-హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లింపు చేయనున్నట్లు వెల్లడించారు. * విజయవాడ - హైదరాబాద్ మధ్య ఆర్.టి.సి. బస్సులు రాకపోకలను పండిట్ నెహ్రూ బస్ స్టాండ్-చల్లపల్లి బంగ్లా- బుడమేరు వంతెన - పైపుల రోడ్-సితార- గొల్లపూడి వై జంక్షన్ ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లింపు * విజయవాడ-ఇబ్రహీంపట్నం మధ్య సిటీ బస్సులను ప్రకాశం స్టాట్యూ -లో బ్రిడ్జ్- గద్ద బొమ్మ కె.ఆర్. మార్కెట్- పంజా సెంటర్- నెప్రో చౌక్- చిట్టినగర్-టన్నెల్- సితార-గొల్లపూడి-ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లింపు * ఇబ్రహీంపట్నం నుండి గొల్లపూడి-సితార-సి.వి. ఆర్ పై ఓవర్-చిట్టినగర్-నెహ్రూ చాక్-పంజా సెంటర్ కే.ఆర్ మార్కెట్ లో బ్రిడ్జి- ప్రకాశం స్టాట్యూ -ఏ.సి.ఆర్-సిటీ బస్ స్టాప్ కు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు ప్రకాశం బ్యారీజీ మీ వాహనాలకు అనుమతి లేదు మూల నక్షత్రం రోజు ఈనెల 20వ తేది రాత్రి నుంచి ఉదయం వరకు ప్రకాశం బ్యారేజ్ మీదకు వాహనాలకు అనుమతి లేదని సీపీ తెలిపారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. మోటార్ వాహనాల కోసం పద్మావతి ఘాట్, ఇరిగేషన్ పర్కింగ్, గద్ద బొమ్మ, లోటస్ అపార్ట్ మెంట్, ఆర్.టి.సి. వర్క్ షాప్ రోడ్ , కార్ల కొరకు సీతమ్మవారి పాటలు, గాంధీజీ మున్సిపల్ హై స్కూల్, టి.టి.డి పార్కింగ్ లను ఏర్పాటు చేశారు. బస్సుల కొరకు పున్నమి ఘాట్ వద్ద పార్కింగ్ ప్రదేశాన్ని ఉంచారు. భక్తులు వచ్చిన మార్గంలోనే వెనక్కి వెళ్లాలి హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు భవానీపురం లారీ స్టాండ్ వద్ద సర్వీస్ రోడ్ నుంచి పున్నమి హోటల్ వద్ద కుడి వైపు తిరిగి పున్నమి ఘాట్ వద్ద పార్క్ చేయాలి. విశాఖపట్నం నుంచి వచ్చే భక్తులు రామవరప్పాడు రింగ్ వద్ద ఇన్నర్ రింగ్ రోడ్ పైపుల రోడ్-వై.వి.రావు ఎస్టేట్-సి.వి.ఆర్. పై ఓవర్-సితార జంక్షన్-ఆర్ టి.సి. వర్క్ షాప్ రోడ్-పున్నమి హోటల్ మీదుగా వచ్చి పున్నమి ఘాట్‌లో పార్క్ చేయాలి. గుంటూరువైపు నుంచి వచ్చే భక్తులు వారధి-కృష్ణలంక ప్లై ఓవర్- ఆర్.టి.సి. ఇన్ గేట్-దుర్గా పై ఓవర్- స్వాతి జంక్షన్-వేంకటేశ్వర ఫౌండ్రీ వద్ద యూ టర్న్ తీసుకొని పున్నమి హోటల్ వరకు వచ్చి అక్కడ కుడి వైపు తిరిగి పున్నమి ఘాట్‌లో పార్క్ చేయాలి భక్తులు వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్లాలని సీపీ బత్తిన శ్రీనివాసులు వెల్లడించారు. -
13గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అడిషనల్ సీపీ అనిల్ కుమార్ తెలిపారు. బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 20 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని తెలిపారు. 11వ రోజున బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు 18కిలోమీటర్ల మేర శోభయాత్ర కొనసాగుతుందని తెలిపారు. 17 ప్రధాన రహదారుల మీదుగా శోభయాత్ర కొనసాగనుందని.. 10వేల లారీలు దీనిలో పాల్గొంటాయన్నారు. అలిబాద్, నాగులచింత, చార్మినార్, మదీన, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా శోభయాత్ర కొనసాగుతుందని దీనికి అనుగుణంగా ట్రాఫిక్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. నిమజ్జనం చూడ్డానికి విదేశాల నుంచి కూడా జనాలు వస్తున్నారని తెలిపారు. శోభయాత్రలో ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదన్నారు. ప్రతి ఒక్కరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఉపయోగించుకోవాలని కోరారు. ఖైరతాబాద్ జంక్షన్, ఆనంద్ నగ్ కాలనీ, గోసేవ సధన్, కట్టమైసమ్మ టెంపుల్, నిజాం కాలేజ్, ఎంఎంటీఎస్ ఖైరతాబాద్ స్టేషన్, బుద్ధ భవన్ వెనుక, లోయర్ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ స్టేడియం, పబ్లిక్ గార్డెన్ వంటి పది చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 6గంటల నుంచే ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదని తెలిపారు. మొత్తం 13 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వెళ్లేవారు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న రోడ్లపై కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఎమర్జెన్సీ వాహనాలు, 108లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామన్నారు. -
హైదరాబాద్ చేరుకున్న మారిషస్ ప్రెసిడెంట్
హైదరాబాద్: రెండు రోజుల పర్యటన కోసం మారిషాస్ అధ్యక్షురాలు బీబీ అమీనా ఫిర్ దౌస్ గురిబ్ ఫాఖిమ్ మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఆమెకు తెలంగాణ మంత్రి కేటీఆర్, పలువులు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె శంషాబాద్ నుంచి ఫలక్ నుమా ఫ్యాలెస్ కు బయల్దేరి వెళ్లారు. కాగా రెండు రోజులపాటు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. మారిషస్ అధ్యక్షురాలు నగరాన్ని సందర్శించనున్న నేపథ్యంలో జంట కమిషనరేట్ల పరిథిలో పలు చోట్ల ట్రాఫిక్ పరిమితులు, దారి మళ్లింపులు ఉండనున్నట్లు నగర పోలీసు కమిషనర్ ఎం మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని నగర పౌరులు దృష్టిలో ఉంచుకొని నేడు, రేపు(బుధవారం) సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ మళ్లింపు ఉండే ప్రాంతాలు... 8.12.2015(మంగళవారం) రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి హోటల్ తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ వైపు ఉండే ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 1గంట మధ్య, హోటల్ ఫలక్ నుమా నుంచి గోల్కొండ వెళ్లే మార్గంలో మధ్యాహ్నం 2.45 నుంచి 3.30 గంటల మధ్య, గోల్కొండ కోట నుంచి ఫలక్ నుమా ప్యాలెస్ మార్గంలో సాయంత్రం 4.15 నుంచి 5.00 గంటల మధ్య, ఫలక్ నుమా ప్యాలెస్ నుంచి చౌమహల్లా ప్యాలెస్ వెళ్లే మార్గంలో 6.30 నుంచి 19.15 గంటల మధ్య ట్రాఫిక్ పరిమితులు, దారి మళ్లింపులు ఉంటాయి. 9.12.2015( బుధవారం) హోటల్ ఫలక్ నుమా ప్యాలెస్ నుంచి చార్మినార్ వెళ్లే మార్గంలో ఉదయం 10.45 గంటల నుంచి 11.30 మధ్య, చార్మినార్ నుంచి సాలార్జంగ్ మ్యూజియం దారిలో ఉదయం 11.30 గంటల నుంచి 11.45 మధ్య, సాలార్జంగ్ మ్యూజియం నుంచి తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ కు వెళ్లే మార్గంలో 12.15 నుంచి 1.00 గంటల మధ్య, ఫలక్ నుమా ప్యాలెస్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో 3.45 నుంచి 4.30 మధ్యకాలంలో ట్రాపిక్ ఆంక్షలు ఉంటాయని మహేందర్ రెడ్డి తెలిపారు. మరో వైపు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు మారిషస్ అధ్యక్షురాలు గోల్కొండ కోటను సందర్శించనున్న నేపధ్యంలో సందర్శకులను నిలిపివేయనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కోటలోకి సందర్శకులను అనుమతించరని అధికారులు తెలిపారు.