విజ‌య‌వాడ‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు | Traffic Restrictions Were Imposed In Vijayawada during Dussehra | Sakshi
Sakshi News home page

17 నుంచి విజ‌య‌వాడ‌లో ఆంక్ష‌లు

Published Wed, Oct 14 2020 7:45 PM | Last Updated on Wed, Oct 14 2020 8:42 PM

Traffic Restrictions Were Imposed In Vijayawada during  Dussehra - Sakshi

సాక్షి, విజయవాడ : ద‌స‌రా ఉత్స‌వాల సంద‌ర్భంగా ఈనెల 17 నుంచి 25వ తేదీ వ‌ర‌కు విజ‌య‌వాడ‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. నగర ప్రజలకు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్ మళ్ళింపులు చేశామ‌ని ,పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామ‌ని సీపీ బత్తిన శ్రీనివాసులు అన్నారు. విజయవాడ మీదుగా ఇతరప్రాంతాలకు వెళ్లే వాహనాలకు సిటీలోకి అనుమతి లేద‌ని తెలిపారు. విశాఖపట్నం - హైదరాబాద్ మధ్య వాహనాలు హనుమాన్ జంక్షన్ నూజివీడు-మైలవరం-జీ కొండూరు - ఇబ్రహీంపట్నం మీదుగా,  విశాఖపట్నం-చెన్నై మధ్య వాహనాలు హనుమాన్ జంక్షన్-అవనిగడ్డ-రేపల్లె-బాపట్ల-చీరాల మీదుగా,  గుంటూరు -విశాఖపట్నం మధ్య వాహనాలు బుడంపాడు నుంచి పొన్నూరు-రేపల్లె-అవనిగడ్డ-హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లింపు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. 

* విజయవాడ - హైదరాబాద్ మధ్య ఆర్.టి.సి. బస్సులు రాకపోకలను పండిట్ నెహ్రూ బస్ స్టాండ్-చల్లపల్లి బంగ్లా- బుడమేరు వంతెన - పైపుల రోడ్-సితార- గొల్లపూడి వై జంక్షన్ ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లింపు

* విజయవాడ-ఇబ్రహీంపట్నం మధ్య సిటీ బస్సులను  ప్రకాశం స్టాట్యూ -లో బ్రిడ్జ్- గద్ద బొమ్మ కె.ఆర్. మార్కెట్- పంజా సెంటర్- నెప్రో చౌక్- చిట్టినగర్-టన్నెల్- సితార-గొల్లపూడి-ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లింపు

* ఇబ్రహీంపట్నం నుండి గొల్లపూడి-సితార-సి.వి. ఆర్ పై ఓవర్-చిట్టినగర్-నెహ్రూ చాక్-పంజా సెంటర్ కే.ఆర్ మార్కెట్ లో బ్రిడ్జి- ప్రకాశం స్టాట్యూ -ఏ.సి.ఆర్-సిటీ బస్ స్టాప్ కు అనుమతి ఇస్తున్న‌ట్లు తెలిపారు

ప్ర‌కాశం బ్యారీజీ మీ వాహ‌నాల‌కు అనుమ‌తి లేదు
మూల నక్షత్రం రోజు ఈనెల 20వ తేది రాత్రి నుంచి  ఉదయం వరకు ప్రకాశం బ్యారేజ్ మీదకు వాహనాలకు అనుమతి లేదని సీపీ  తెలిపారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. మోటార్ వాహ‌నాల కోసం  పద్మావతి ఘాట్, ఇరిగేషన్ పర్కింగ్, గద్ద బొమ్మ, లోటస్ అపార్ట్ మెంట్, ఆర్.టి.సి. వర్క్ షాప్ రోడ్ , కార్ల కొరకు సీతమ్మవారి పాటలు, గాంధీజీ మున్సిపల్ హై స్కూల్,  టి.టి.డి పార్కింగ్ ల‌ను  ఏర్పాటు చేశారు. బస్సుల కొరకు పున్నమి ఘాట్ వద్ద పార్కింగ్ ప్ర‌దేశాన్ని ఉంచారు. 

భక్తులు వచ్చిన మార్గంలోనే వెన‌క్కి వెళ్లాలి
హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు భవానీపురం లారీ స్టాండ్ వద్ద సర్వీస్ రోడ్ నుంచి పున్నమి హోటల్ వద్ద కుడి  వైపు తిరిగి పున్నమి ఘాట్ వద్ద పార్క్ చేయాలి.  విశాఖపట్నం నుంచి వచ్చే భక్తులు రామవరప్పాడు రింగ్ వద్ద ఇన్నర్ రింగ్ రోడ్ పైపుల రోడ్-వై.వి.రావు ఎస్టేట్-సి.వి.ఆర్. పై ఓవర్-సితార జంక్షన్-ఆర్ టి.సి. వర్క్ షాప్ రోడ్-పున్నమి హోటల్ మీదుగా వచ్చి పున్నమి ఘాట్లో పార్క్ చేయాలి. గుంటూరువైపు నుంచి వచ్చే భక్తులు వారధి-కృష్ణలంక ప్లై ఓవర్- ఆర్.టి.సి. ఇన్ గేట్-దుర్గా పై ఓవర్- స్వాతి జంక్షన్-వేంకటేశ్వర ఫౌండ్రీ వద్ద యూ టర్న్ తీసుకొని పున్నమి హోటల్ వరకు వచ్చి అక్కడ కుడి వైపు తిరిగి పున్నమి ఘాట్లో పార్క్ చేయాలి భ‌క్తులు వ‌చ్చిన మార్గంలోనే తిరిగి వెళ్లాల‌ని సీపీ బత్తిన శ్రీనివాసులు వెల్ల‌డించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement