Vijaya Dashami
-
ప్రతి అమ్మా దుర్గమ్మే
విజయ దశమి సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచనకర్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు సాక్షి ఫ్యామిలీకి ప్రత్యేకంగా చెప్పిన ముఖ్య విశేషాలు...పదవరోజుతో ఎందుకు ముగించాలి...లోకంలోని ప్రతి అమ్మా ఆ లోకంలోని జగదంబకి ప్రతిరూపం. ఈమె కనిపిస్తుంది. ఆమె కన్పించదు. ఈమె ఎలాగైతే తొమ్మిది నెలలపాటు తనలో జరిగే వ్యాధులూ అలజడీ... తోపోరాడి 10వ నెలలో సంతాన విజయాన్ని సాధిస్తోందో– అలా అమ్మ ఈమెకి మార్గదర్శకురాలిగా తొమ్మిది రాత్రులపాటు (రాక్షసులకి రాత్రే బలం అధికం. నిశాచరులు కదా) పోరాడి పోరాడి 10వ నాడు దశమి విజయాన్ని సాధించింది కాబట్టి దేవీ నవరాత్రులంటే ప్రతి స్త్రీ విజయానికీ సాక్ష్యమన్నమాట. సంతానాన్ని కనగలగడమంటే అమ్మ అనుగ్రహంతో జయాన్ని సాధించి పండంటి బిడ్డని పొందడమన్నమాట. జయమంటే గెలుపు. అమ్మ అనుగ్రహం దానికి అండగా నిలిస్తే అది విజయం అన్నమాట!రోజూ అమ్మకి కొత్తకొత్తగా ముస్తాబు...అమ్మ అలంకారాల విషయానికి వద్దాం... స్థూలంగా చెప్తే– యోగసాధన చేయదలచిన సాధకుడు మొదటి రోజున బాల్య స్థితిలో ఉంటాడు. అదే బాలా త్రిపుర సుందరీ రూపం. అమ్మ తన సంతానాన్ని బడికి పంపేముందు కడుపునిండుగా అన్నం పెట్టి పంపుతుంది. అదుగో అదే అన్నపూర్ణా రూపం. సంతానం బడికెళ్లాక మూడవ కన్నయిన జ్ఞానాన్ని పొందుతారు. అదే గాయత్రీ రూపం. గాయత్రీ మంత్రానుష్ఠానం సాగగానే ఆ వ్యక్తికి ఓ వాక్ఛక్తి వచ్చి, అతడు ఏం చెప్తే అది జరగడం ప్రారంభమౌతుంది. ఆ శక్తిని ధనార్జనకి ఉపయోగిస్తాడా? లేక పై చదువుకోసం వినియోగిస్తాడా... అని పరీక్షించడం కోసం 4వ రోజున పరీక్ష కోసం మహాలక్ష్మీ రూపం వేస్తారు. ఆ ఆలోచనని జయిస్తే సరస్వతి లక్ష్మి ఇతర దేవతలూ... ఇలా అందర్నీ శాసించగల లలితారూపాన్ని దర్శించేలా 5వ రోజున లలితా రూపాన్ని వేస్తారు. ఆరవ రోజున షష్ఠి తిథి మూలా నక్షత్రం ఉండే కారణంగా సరస్వతీ రూపాన్ని వేయించి జ్ఞాన అజ్ఞానాలకీ, విరోధం విచక్షణం అనే రెంటికీ మూలమైన శక్తిని తెలుసుకునేలా చేస్తారు.7వ రోజున వివాహిత అయిన స్త్రీ తన భర్తతో కలిసి ఉన్నప్పుడే భోగాన్నీ (మానసికానందం) పొందగలదని ఉపదేశిస్తూ భవానీ రూపాన్ని వేస్తారు. 8వ రోజున ఎంతటి కష్టానికైనా అండగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ దుర్గారూపాన్నీ– 9వ రోజున శత్రువుని ఎదుర్కొనే సాహసాన్ని ప్రతి స్త్రీ కలిగి ఉండాలనే దృష్టిని నేర్పుతూ మహానవమి నాడు క్రోధ రూపిణి అయిన కాలి రూపాన్నీ– 10వ రోజున మహిసాసుర మర్దినీ రూపాన్నీ (జాడ్యం బద్ధకం నిర్లక్ష్యం సిగ్గులేనితనం.. వంటి లక్షణాలని తొలగించగల) వేస్తారు. స్త్రీ అలా ఉన్న రోజున రాజరాజేశ్వరిగా సర్వులకీ అధిపత్ని గా ఉంటూ అ–పరాజిత (చేపట్టిన కార్యక్రమంలో ఓటమి లేనిది) గా అవుతుందని ఈ రూపాలతో నిరూపిస్తారు.అమ్మ చేతిలో మారణాయుధాలా?మనింట్లో ఉండే కూరగాయల్ని తరుక్కునే కత్తిపీట– వంటింట్లో ఉండే పొయ్యిమంటా... ఏవి కావు మారణాయుధాలు? వాటి ఉపయోగాన్ని బట్టి అవి ప్రయోజనాన్ని సాధించుకునే ఉపాయాలూ లేదా మారణాయుధాలూ ఔతాయి. అమ్మ చేతిలో పాశం అనురాగపాశం. అందుకే మనం ఈ ఉత్సవాలను చేసుకునేలా దాంతో బంధించింది. అమ్మ చేతిలోని అంకుశం మనం అహంకారం గర్వం హోదా ఉందనే దర్పంతో ఉన్నప్పుడు (తమోగుణం)– ఆ మదగజంలా ఉన్న మనని తోవలో పెట్టేందుకు ఉపయోగించే సాధనం. అలాగే ఆమె చేతిపుష్పబాణం మనని తన దగ్గరకి రప్పించుకునేందుకు చూపే ఆకర్షణా కుసుమం. మనని కోరికకి లొంగి΄ోకుండా నిలబడగల ధైర్యాన్ని పొందవలసిందిగా సూచించే పుష్పబాణం. పరిస్థితుల్ని దాటినట్లైతే మనని వధించడానికి లేదా శిక్షించి తోవలోకి తెచ్చేందుకు అమ్మ వాడే చాపం. అర్థం చేసుకోగలగాలి! అవి రక్షణాయుధాలు– వ్యతిరేకించిన పక్షంలో మారణాయుధాలు.దేవీ నవరాత్రుల ద్వారా తెలుసుకోవలసింది..?సంవత్సర చక్రంలో ఉగాది రాగానే అమ్మకి వసంత నవరాత్రోత్సవాలు పేరిట 9 రోజులపాటు ఉత్సవాలు, కొందరైతే పూర్ణిమ వరకూ పండుగ చేస్తారు. మళ్లీ శ్రావణ మాసంలో నాలుగు లేదా ఐదు మంగళవారాలు, మళ్లీ నాలుగు లేదా ఐదు శుక్రవారాలూ అమ్మ పండుగలే. ఇదుగో ఈ ఆశ్వయుజంలో పాడ్యమినుండి అమావాస్య వరకూ ఆమె పండుగలే 30 రోజులపాటు. కార్తికమాసం అంతటా శివునితో కలిపి పూజాఉత్సవాలే ఆమెకి. మొత్తం అమ్మకి పండుగరోజులెన్ని... అని ఆలోచిస్తే.. కనిష్ఠంగా 9+4+4+30+15=62 స్త్రీని ఓ దేవతగా ప్రతి సంవత్సరమూ ఆరాధించే ఉత్తమ సంస్కారం భారత దేశానిదే.లలితా సహస్ర నామాల్లో ఏముంటుందంటే...అమ్మకున్న వెయ్యి నామాల్లో అమ్మవారి భౌతిక రూప వర్ణనం– ఆమె ఏ మంత్ర రూపంలో ఉంటుందో ఆ మంత్ర స్వరూప విధానం– స్త్రీలలో చైతన్యాన్ని ఎలా అమ్మ నింపి ‘శక్తి సేన’ అనే ఓ దాన్ని సిద్ధం చేసిందో ఆ పద్ధతీ– ఆమెకి తన సాహస పరాక్రమాలతో దుర్మార్గులూ లోకకంటకులూ అయిన పురుష రాక్షసుల్ని ఎలా సహరించిందో తన సైన్య సహాయంతో ఆ దృశ్యం – గర్భవతి అయిన ఆమెలో ఎదుగుతున్న శిశువుకి ఏ నెలలో ఏ తీరు ఆహారసారాన్ని అందించాలో ఆ వైద్యక్రమం, శత్రువుల్ని ఎలా వధించాలో ఆ తీరుతెన్నులూ, భర్తతో ఎలా అన్యోన్యంగా ఉండాలో ఆ జీవన విధానం.. ఇలా వివరింపబడ్డాయి.దేవీ నవరాత్రాల ముఖ్యోద్దేశం అరాచకాలు చేసే పురుషుల్ని సాహస పరాక్రమాలని తోటి స్త్రీల సహాయంతో ఎదిరించి వాళ్లకి భయం కలిగేలా చేయడం– భర్తతో కలిసే ఉండే తీరుని నేర్పడం– కుటుంబ రహస్యాలని గోప్యంగా ఉంచుకుంటూ సత్త్వ గుణంతో పరిస్థితిని సానుకూలత ఉండేలా చేసుకోవడం– ఎవరో వచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలనుకోవడం, ఎదురు చూడ్డం కాకుండా తమె కుటుంబాన్ని తామే రక్షించుకోగల నేర్పరితనాన్ని సధైర్యంగా సాధించుకోగల విధానాన్ని నేర్పడమనేవి వీటి ముఖ్యోద్దేశాలు. -
వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి అని ఆయన అన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని పేర్కొన్నారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులు, సిరిసంపదలతో తులతూగాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
స్త్రీ శక్తి విజయం విజయ దశమి
ఈ చరాచర జగత్తుని నడిపించేది శక్తి. ఈ శక్తి లేనట్టయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ కృత్యాలైన సృష్టి స్థితిలయాలు నిర్వర్తించటమే కాదు, కదలటం కూడా చేత కాని వారవుతారు. ఆ శక్తినే అదిశక్తి, పరాశక్తి అంటారు. ఆ శక్తి త్రిగుణాత్మకంగా ఉంటుంది. సత్వరజస్తమో గుణాలతో శక్తిబీజం సంయోగం చెందితే ‘స్త్రీ’అవుతుంది. అటువంటి త్రిగుణాలతో కూడిన శక్తి ఆవిర్భవించి దుష్టరాక్షస సంహారం చేసిన సమయం శరదృతువు. ఇవే కాదు మహాశక్తి ఎప్పుడు ఎక్కడ దుష్టసంహారం చేయవలసిన అవసరం వచ్చినా, శిష్టరక్షణ చేయవలసిన అవసరం కలిగినా జీవులపై ఉన్న అంతులేని ప్రేమతో అవతరిస్తూ వచ్చింది. ఎంతైనా జగన్మాత కదా! అన్ని సందర్భాలలోను ఆ తల్లి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు అవతరించి నవమి నాడు రాక్షససంహారం చేయటం జరిగింది. కనుక ఆదిపరాశక్తిని ఆ సమయంలో పూజించి ఆ తల్లి అనుగ్రహం పొందటం సంప్రదాయం అయింది. అందరు దేవతల శక్తి ఏకీకృతమై రూపుదాల్చిన శ్రీదేవి రాక్షసులతో యుద్ధంచేసే సమయంలో దేవతలు, ఋషులు ఆమెకు పుష్టి కలగటానికి – యజ్ఞాలు, హోమాలు, జపాలు, తపాలు, పూజలు, పారాయణలు మొదలైన దీక్షలు పూనారు. మానవులు కూడా ఉడతాభక్తిగా తమకు తోచిన విధంగా దీక్షలు చేయటం మొదలు పెట్టారు. ప్రథమంగా ఆవిష్కృతమైన శక్తి తమోగుణ ప్రధానమైనది. నిర్గుణయైన పరాశక్తి మొదటి సగుణ ఆవిర్భావం తమోగుణమయమైన మహాకాళి. అందువల్లనే మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ అని జగదంబిక త్రిశక్తులలో మొదటిదిగా మహాకాళినే పేర్కొనటం జరుగుతుంది. ఇది వైవస్వత మన్వంతర వృత్తాంతం. సావర్ణి మన్వంతరంలో ఆదిపరాశక్తి రజోగుణ ప్రధానమైన మహాలక్ష్మిగా అవతరించింది. దానికి హేతువు మహిషాసురుడు.ఈ తత్త్వాన్ని వంట పట్టించుకోవటం ఏ కాలం లోనైనా అవసరమే. మహిషాసురులు ఎప్పుడూ ఉంటారు. అందుకే మహిషాసుర మర్దినులైన మహాలక్ష్ముల అవసరం ఎప్పుడూ ఉంటుంది. మహిషుని సంహరించేందుకు త్రిమూర్తుల నుంచి ఉద్భవించిన తేజస్సు అమ్మవారిగా ఆకారం ధరించింది. దేవతలందరూ ఆమెకు తమ తేజస్సును, ఆయుధాలను సమకూర్చారు. తన సంహారం కోసమే ఆమె ఆవిర్భవించిందని తెలిసినా మహిషుడు రకరకాలుగా ఆమెను ప్రలోభ పెట్టాలని చూశాడు. ఆమె అంగీకరించకపోయేసరికి కామరూపి గనుక ఆమెతో రకరకాల రూపాలతో యుద్ధం చేశాడు. ఆ రూపాలకు తగిన రూపాలను ధరించి దేవి మహిషరూపంలో ఉన్న రాక్షసుని సంహరించింది. ఇది జరిగింది ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున. అప్పటివరకు దీక్ష వహించిన వారందరు దశమి నాడు జగదంబను స్తుతించి, అమ్మకు పట్టాభిషేకం చేసి, స్త్రీ శక్తి విజయానికి వేడుకలు చేసుకుని ఆనందించారు. వారి స్తుతులకు సంతసించిన శ్రీ దేవి వారిని వరం కోరుకోమన్నది. తమకు అవసరమైనప్పుడు ఈ విధంగా కాపాడమని కోరారు. ఆమె వారు తలచినప్పుడు అవతరిస్తానని మాట ఇచ్చింది. మరొకప్పుడు శుంభ నిశుంభులనే దానవ సోదరులు వేల ఏండ్లు తపస్సు చేశారు. బ్రహ్మ వారి తపసుకి మెచ్చి, ప్రత్యక్షమై వరం కోరుకోమంటే – తమకు అమరత్వం ప్రసాదించమని కోరారు. బ్రహ్మ అది తన చేతులలో లేదని, ఇంకేదైన వరం కోరుకోమని అన్నాడు. వారు తమకు అమర, నర, పశు, పక్షి పురుషుల వల్ల చావులేని వరం ఇమ్మని కోరారు. అంతటితో ఆగలేదు. స్త్రీలు బలహీనులు కనుక మాకు వారి వల్ల భయం లేదు అని చెప్పారు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. స్వర్గంపై దాడి చేసి, ఇంద్రుని ఆసనాన్ని అధిరోహించి, త్రైలోక్యాధిపత్యాన్ని, యాగభాగాలని కూడా హరించారు. దిక్పాలకులను సూర్యచంద్రాది దేవతలను గెలిచి, వారి పదవులను కూడా గ్రహించాడు. వారి పనులు కూడా తానే చేయటం మొదలు పెట్టాడు. దేవతలు బృహస్పతి సూచనననుసరించి హిమవత్పర్వతం మీద ఉన్న దేవిని శరణు వేడారు. జగదంబ వారికి అభయం ఇచ్చింది. ఆ సమయంలో సర్వదేవతలు తమ తమ శక్తులను జగదంబకు తోడుగా పంపారు. అవన్నీ ఆయా దేవతలకు చెందిన ఆభరణాలను, ఆయుధాలను ధరించి, వాహనాలను అధిరోహించి వచ్చి రక్తబీజుని సైన్యాన్ని మట్టు పెట్టసాగాయి. ఈ శక్తులను మాతృకాగణాలు అంటారు. 1. బ్రహ్మ శక్తి బ్రహ్మాణి. 2. విష్ణువు శక్తి వైష్ణవి 4. కుమారస్వామి శక్తి షష్ఠీ దేవి కౌమారి. 5. ఇంద్రుని శక్తి ఐంద్రి, మాహేంద్రి, ఇంద్రాణి అనే పేర్లు కూడా ఆమెకున్నాయి. 6. ఆదివరాహమూర్తి శక్తి వారాహీ దేవి 7. నృసింహుని శక్తి నరసింహ రూపం నారసింహీ అనే నామం. ఈ మాతృకా గణంతో పాటుగా వరుణుని శక్తి వారుణీదేవి శత్రువులని పాశంతో బంధించి, మూర్చితులను చేసి, ప్రాణాలను తీస్తోంది. యముని రూపంతో యముని శక్తి యామ్యాదేవి మహిషము నెక్కి, దండాన్ని ధరించి, భయం గొలిపే విధంగా రణభూమిలో అడుగు పెట్టి, దానవులని యమసదనానికి పంపుతోంది. వీరికి తోడు శివదూతి కూడ విజృంభించి దానవులను నేలకూల నేస్తూ ఉంటే, చాముండా, కాళికలు వారిని తినేస్తున్నారు. దానవులు భయపడి పారిపోతుంటే రక్తబీజుని కోపం మిన్ను ముట్టి, దేవితో యుద్ధానికి వచ్చాడు. మాతృకాగణాలు అతడిపై ఆయుధాలను వేయగానే వాడి శరీరం నుండి కారిన ప్రతి రక్తబిందువు నుండి, ఒక్కొక్క రక్తబీజుడు పుట్టి వారి సంఖ్య అసంఖ్యాకం అయింది. దేవతలందరు భయభ్రాంతులై పోయారు. అప్పుడు అంబిక కాళికను నోరు పెద్దది చేసి, రక్తబీజుడి నుండి కారుతున్న రక్తాన్నంతా తాగివేయ మని చెప్పింది. వాడి శరీరం నుండి కారుతున్న రక్తాన్ని, కింద పడకుండా తాగటంతో వాడు నీరసించాడు. వాడి శరీరాన్ని శ్రీదేవి ముక్కలు చేస్తుంటే, కాళిక తినేసింది. అంబిక వాహనమైన సింహం కూడా ఎంతో మంది దానవులని తినేసింది. అపుడు నిశుంభుడు శ్రీదేవితో యుద్ధానికి బయల్దేరాడు. ముందుగా నిశుంభుడి తల తెగ నరికింది దేవి. అయినా అతడి మొండెం కత్తి పట్టుకొని తిరుగుతుంటే ఆ మొండెం కాళ్ళు చేతులు నరికింది దేవి. దానితో నిశుంభుడు అసువులు బాసాడు. శుంభుణ్ణి శ్రీదేవి తనతో యుద్ధం చేయలేకపోతే చండికతో గాని, కాళికతో గాని యుద్ధం చెయ్యమంది. అతడు పౌరుషం పెరిగి, శ్రీదేవితోనే యుద్ధం చేయదలచాడు. ఘోరయుద్ధం తరువాత శ్రీదేవి శుంభుని పరిమార్చింది. దేవతలకు తిరిగి స్వర్గ రాజ్యం లభించింది. మాటలతో సాధించిన విజయానికి సంకేతం ఇది. మాట నైపుణ్యంతో యుద్ధానికి ఆహ్వానించి గెలిచిన జగన్మాత అవతారాన్ని మహా సరస్వతిగా చెప్పటం జరిగింది. సామూహికంగా కుంకుమార్చనలు చేసినా, చండీహోమాదులు చేసినా, బొమ్మల కొలువులు పెట్టినా, బతకమ్మలు ఆడినా కనపడేది ఏదైనా పదిమంది కలిసి చేయాలనే ఐక్యభావన. శక్తి స్వరూపమైన స్త్రీ జాతి పట్ల గౌరవ మర్యాదలు నెరపటం. ‘‘యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః.’’ నవరాత్రులు అన్నా, అమ్మవారి పూజలన్నా ప్రధానంగా చేసేది లలితా రహస్య నామ సాహస్ర పారాయణం. కుంకుమార్చన చేసినా సహస్రనామాలతోనే చేస్తారు. జగదంబ లలితాదేవిగా ఆవిర్భవించిన ఇతివృత్తం బ్రహ్మాండ పురాణం లలితో పాఖ్యానంలో వివరించబడింది. ఆమె సర్వచైతన్యస్వరూపిణి కనుక ఆమెను ‘లలిత’ అని పిలిచారు.తమను కన్నతల్లి లాగా భావించి శ్రీమాతా! అని సంబోధించారు. జీవితం అంటే సుఖపడటం – సుఖపడటం అంటే తినటం, నిద్ర పోవటం మాత్రమే అని భావించటమే బండతనం. అటువంటి వారికి ఉండేది శూన్యమే కదా! బండతనం పోవాలంటే తగిన మార్గం ఒకటే. అది చైతన్యవంతులు కావటమే. అందుకే జగదంబ భండాసురవధ చేయటానికి సర్వచైతన్యస్వరూపిణిగా అవతరించింది. బండతనం మీద చైతన్యం విజయం సాధించటానికి సంకేతం విజయదశమి. శరన్నవరాత్రులలో అమ్మ అవతారాలలో లలితాదేవి అవతారం ఎంతో ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుంది. నిజానికి శక్తి అన్నా చైతన్యమన్నా ఒకటిగానే భాసిస్తాయి. చైతన్యం లేనిదే శక్తి వ్యక్తం అయ్యే అవకాశం లేదు కదా! సమాజంలో ఎప్పుడూ మంచి చెడూ కలిసే ఉంటాయి. వాటి మధ్య జరిగే సంఘర్షణలో మంచి గెలవటానికి ప్రతీక విజయ దశమి. అలా మంచి గెలవటానికి ఎప్పుడు ఏ శక్తి కావాలో ఆ శక్తిగా అవతరించి సజ్జనులకు తోడుపడుతుంది జగన్మాత. అది శరీరంలో అనారోగ్యం కావచ్చు, మనస్సులో ఉన్న దుర్గుణాలు, దురాలోచనలు కావచ్చు, సమాజంలో ఉన్న దురాచారాలు, మూఢనమ్మకాలు కావచ్చు, ప్రకృతిని, పర్యావరణాన్ని కలుషితం చేసే మాలిన్యాలు కావచ్చును, సృష్టి నియమాలకి విరుద్ధంగా కలకాలం బతికి ఉండాలనే స్వార్థం కావచ్చును, ఒక జాతినో, వర్గాన్నో చులకన చేసే అహంకారం కావచ్చు ఒక జాతినో, వర్గాన్నో అవమానం చెయ్యటం కావచ్చును – ఇటువంటి ఎన్నో చెడులక్షణాల మీద విజయం సాధించిన రోజు విజయ దశమి. ముఖ్యంగా స్త్రీ పట్ల చులకన భావం కలిగిన దున్నపోతు మనస్తత్వం మీద స్త్రీ శక్తి విజయానికి సంకేతం విజయ దశమి. సద్భావనలు పెంపొందించుకునే రోజు. అందుకే ఒకరినొకరు అభినందించుకుంటూ జమ్మి పత్రాలని బంగారం, వెండి అనే పేరుతో పంచుకుంటూ ఉంటారు. – డాక్టర్ ఎన్ .అనంతలక్ష్మి -
అమ్మవారి విగ్రహ నిమజ్జనంలో అపశ్రుతి.. 8 మంది మృతి, షాకింగ్ వీడియో
కోల్‌కత: విజయదశమి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురిలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా 8 మంది మృతి చెందారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు మాల్ నదిలోకి దిగారు. అయితే, ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో పలువురు కొట్టుకుపోయారు. వారిలో 8 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గల్లంతయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటన బుధవారం రాత్రి 8.30 ప్రాంతంలో జరిగిందని జల్పైగురి జిల్లా కలెక్టర్ మౌమితా గోదర తెలిపారు. వందలాది మంది విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు మాల్ నది ఒడ్డున పోగయ్యారని, అంతలోనే భారీ ఎత్తున వరద ప్రవాహం పెరగడంతో కొందరు కొట్టుకుపోయారని వెల్లడించారు. 50 మంది స్థానికుల సాయంతో బయటపడ్డారని, కొందరు గల్లంతయ్యారని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడ్డ 13 మందిని ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు. గల్లంతైన వారికోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, స్థానిక యంతాంగంతో ముమ్మర గాలింపు చర్యలు కొనసాగున్నాయని అన్నారు. మాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మంత్రి బులు చిక్ బరైక్ మాట్లాడుతూ.. మృతుల సంఖ్య పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నట్టు తెలిపారు. బలమైన వరద కారణంగా కళ్లముందే చాలామంది నదిలో కొట్టుకుపోయారని అన్నారు. కాగా, మంత్రి బులు, మరికొంతమంది తృణమూల్ నేతలు సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. సహాయకచర్యలను ముమ్మరం చేయాలని ప్రతిపక్షనేత సువేంధు అధికారి పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. జల్పైగురి దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. Saddening news coming from Jalpaiguri as flash flood in Mal river during Durga Puja immersion swept away many people. Few deaths have been reported till now. I request the DM of Jalpaiguri & @chief_west to urgently step up rescue efforts & provide assistance to those in distress. pic.twitter.com/4dZdm2WlLO — Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) October 5, 2022 8 Dead, Several Missing During Idol Immersion In West Bengal. #JalpaiguriAccident #Jalpaiguri pic.twitter.com/hTgAAJvYmq — Jagadanand Pradhan (@JPradhan_) October 6, 2022 Anguished by the mishap during Durga Puja festivities in Jalpaiguri, West Bengal. Condolences to those who lost their loved ones: PM @narendramodi — PMO India (@PMOIndia) October 5, 2022 -
ఆ మూడు గ్రామాల్లో దసరా జరుపుకోరు...రావణుడే వారి దేవుడు
దసరా ఉత్సవాలను యావత్ భారతదేశం అంగ రంగ వైభవంగా జరుపుకుంటోంది. అలాగే దసరా అనగానే గుర్తుకొచ్చేది రావణ దహనం. ఈ విజయదశమి రోజునే రాముడు రావణుడిని చంపి విజయం సాధించినట్లుగా పురాణాల కథనం. అలాగే పాండవుల రాజ్యాన్ని పోగొట్టుకుని వనవాసం చేయాల్సి రావడంతో... జమ్మి చెట్టును పూజించి అక్కడే తమ ఆయుధాలను దాచినట్లు మహభారతగాథ తెలుపుతోంది. ఆనాటి నుంచి దసరా చివరి రోజు అనగా విజయదశమి రోజున రావణ దహనం చేయడం, జమ్మి చెట్టును పూజించడం వంటివి అనాదిగా చేస్తున్నారు. కానీ ఇక్కడ ఓ మూడు గ్రామాల వారు దసరానే జరుపుకోరు, పైగా రావణ దహనాన్ని వ్యతిరేకిస్తారట. అంతేగాదు వారికి రావణుడే ఆరాధ్య దేవుడు. ఇంతకీ ఏంటా గ్రామాలు? ఎందుకు చేసుకోరో తెలుసుకుందామా!. 'రావణ' పేరుతో గ్రామం ఉత్తరప్రేదేశ్‌లోని, బిస్రాఖ్, బరాగావ్ అనే రెండు గ్రామాలు రావణ దహనం చేయరు, అలా చేయడాన్ని వ్యతిరేకిస్తారు. ఉత్తరప్రేదేశ్‌లోని బాగాపత్ జిల్లాలో బరాగావ్ గ్రామం ఉంది. ఆ గ్రామవాసులు రావణుడిని దైవంగా భావిస్తారు. ఈ గ్రామాన్ని "రావణుడు" అని కూడా పిలుస్తారు. పురాణ కథనం ప్రకారం....రావణుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేసి శక్తి పొందాడని, తనతో శక్తిని తీసుకువచ్చేటప్పడూ అతడు ఈ గ్రామం గుండా వెళ్లినట్లు కథనం. ఐతే ఆ శక్తిని రావణుడు భరించలేకపోవడంతో ఆ గ్రామంలోని ఒక రైతుకి ఇచ్చాడని, అతను ఆ శక్తిని నేలపై పెట్టినట్లు చెబుతున్నారు. దీంతో శక్తి రావణడుతో తిరిగి వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో ఏ ప్రదేశంలో శక్తి నెలపై ఉంచబడిందో అక్కడే మానసా దేవి ఆలయాన్ని నిర్మించి పూజించనట్లు ఆ ఆలయ పూజారి గౌరి శంకర్ పూరాణ కథను వివరించారు. అందువల్లే ఆ గ్రామంలో నివాసితులు ఈ పండుగను జరుపుకోవడానికి నిరాకరిస్తారు. రావణడు జన్మించిన గ్రామం అలాగే ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ నగర్ జిల్లాలోని బిస్రాఖ్ వాసులు కూడా బరాగావ్ గ్రామ వాసుల మాదిరిగానే దసరాను జరుపుకోరు. ఐతే ఈ గ్రామంలో కూడా రావణ, మేఘనాథ్, కుంభకర్ణలను దహనం చేసేందుకు ఒప్పుకోరట. పురాణల ప్రకారం... విశ్రవ రుషికి జన్మించిన రావణుడి బాల్యం బిస్రాఖ్‌లో జరిగింది. లంకేశ్వరుడైన రావణుడు తమ గ్రామంలో జన్మించాడని, గొప్ప శివభక్తుడైన రావణుడు పూజించిన ఆలయం 'మహంత్‌ని' రావణ ఆలయంగా పిలుస్తామని ఆ గ్రామా నివాసి రామదాస్ చెబుతున్నారు. తమ గ్రామం రావణుడిని తమ ఊరి బిడ్డగా నమ్ముతోందన్నారు. అలాగే రావణుడు తండ్రి విశ్రవస్ వల్ల తమ గ్రామానికి పేరు వచ్చిందని తాము విశ్వాసిస్తామని చెప్పారు. అందుకు గర్విస్తున్నామని కూడా చెబుతున్నారు. రావణుడంత తెలివి, భక్తి కావాలని.... మహారాష్ట్రాలోని అకోలా జిల్లాలోని సంగోలా గ్రామం రావణుడిని తమ ఆరాధ్యం దైవంగా కొలుస్తోంది. రావణుడి ఆశీర్వాదం వల్లే తాము జీవనోపాధిని పొందుతున్నట్లు నమ్ముతారు. అంతేగాదు రావణుడి వల్లే తమ గ్రామం శాంతి సౌఖ్యాలతో ఉన్నట్లు గ్రామస్తులు విశ్వసిస్తారు. గత 300 ఏళ్లుగా ఆ గ్రామంలో రావణుడిని పూజించే సంప్రదాయం కొనసాగుతోందని నివాసితులు చెబుతున్నారు. పైగా రావణుడి అంత తెలివి, భక్తి పెంపొందాలని పూజలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: Dussehra 2022: పాలయమాం దేవీ!) -
ఇంటింటా దసరా...
-
West bengal: ‘దుర్గాపూజ చేసుకునే హక్కు మాకుంది’
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో విజయదశమిని పురస్కరించుకొని శుక్రవారం సోనాగచిలోని సెక్స్ వర్కర్లు దుర్గాదేవికి పూజలు నిర్వహించారు. దుర్గాదేవి పూజ అనంతరం డెబీ బోరాన్, సిందూర్ ఖేలా, ధునుచి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా సెక్స్ వర్కర్ల దర్బార్ మహిళా సమితి సభ్యురాలు విశాఖ లష్కర్ మాట్లాడుతూ.. ఈ సమాజంలో తమకు సమాన హక్కులు లేవని, అందుకే తమ పిల్లలు ఈ సమాజాన్ని ఆమోదించడంలేదని అన్నారు. దీంతో తాము మరో ప్రపంచం నుంచి వచ్చామనే భావన కలుగుతోందని తెలిపారు. దానికి గల కారణం తాము సెక్స్ వర్కర్లము కావడమే అనిపిస్తోందని అన్నారు. కుటుంబాలను పోషించుకోవటం కోసమే తాము ఈ వృత్తిలో ఉన్నమని తెలిపారు. అయితే దుర్గా పూజ వేడకలు జరుపుకోవడాని తమకు కూడా హక్కు ఉందని పేర్కొన్నారు. తాము ఈ సమాజమానికి చెందినవారిమనే సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నామని తెలిపారు. ప్రతి సెక్స్ వర్కర్‌కు దుర్గాదేవి పూజ చేసుకునే హక్కు ఉందని పేర్కొన్నారు. అయితే దుర్గాదేవి పూజలు నిర్వహించేందుకు గతంలో వీరికి అనుమతి ఉండేది కాదు. దాని కోసం వీరు పోరాటం చేశారు. సెక్స్ వర్కర్లు దుర్గాపూజ చేసేందుకు అనుమతి కోసం దర్బార్ మహిళా సమితి కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. దీంతో వారికి దుర్గాపూజ చేసుకోవచ్చని 2013లో కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇచ్చింది. -
బస్సెక్కాలంటే భయం.. దోచేస్తున్న ప్రైవేటు ఆపరేటర్లు
దసరా పండగ వచ్చిందంటే పిండి వంటలు, కొత్త బట్టలు ఇలా బడ్జెట్ లెక్కలు వేసుకుంటారు సామాన్యులు, కానీ ఇప్పుడా లెక్కలు తారుమారు అవుతున్నాయి. కుటుంబ సమేతంగా ఇంటికి వెళ్లాలంటే భారీ బడ్జెట్ కేటాయించాల్సిందే. ప్రైవేటు ఆపరేటర్లు ఇష్టారీతిగా టిక్కెట్ల ధరలు పెంచడంతో ఈ పరిస్థితి నెలకొంది. బస్సుల్లోనే దసరా పండుగ వేళ ఇళ్లకు వెళ్లే వారి జేబులు గుల్ల అవుతున్నాయి. ఇటు ఆర్టీసీ అటు ప్రైవేటు ఆపరేటర్లు ఛార్జీలు పెంచేయడంతో సొంతిరికి ప్రయాణం భారంగా మారింది. ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసీలు స్పెషల్ బస్సుల పేరుతో యాభై శాతం ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. సాధారణ బస్సుల్లో రెగ్యులర్ ఛార్జీలే ఉన్నా స్పెషల్ బస్సుల్లో మాత్రం అధికం తప్పడం లేదు. మరోవైపు పండగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడిపించే రైల్వేశాఖ కోవిడ్ ఎఫెక్ట్‌తో గతేడాది నుంచి ప్రత్యేక రైళ్లు ఎక్కువగా నడిపించడం లేదు. దీంతో ఎక్కువ మంది బస్సుల్లోనే సొంతూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. నాలుగు వేల బస్సులు ఇదే అదనుగా భావించిన ప్రైవేటు ఆపరేటర్లు ఎడా పెడా టిక్కెట్ల ధరలు పెంచేశారు. దీంతో సామాన్యుల పండగ బడ్జెట్లో లెక్కలు తారుమారు అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి నిత్యం నాలుగు వేలకు పైగా ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. ఇందులో సగానికి పైగా బస్సులు ఏపీకే వెళ్తుంటాయి. మిగిలిన బస్సులు బెంగళూరు, ముంబై , ఇతర పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటాయి. దసరా పండగ సందర్భంగా పది రోజులకు పైగా సెలవులు రావడంతో ఏపీకి చెందిన వారు కుటుంబ సమేతంగా తమ రాష్ట్రాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇలా వెళ్తున్న వారికి ప్రైవేటు ఆపరేటర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఆన్లైన్లో ఫిల్ ఆర్టీసీతో పోటీ పడుతూ ప్రైవేటు ఆపరేటర్లు సైతం అధికారికంగా పండగ బస్సులకు 50 శాతం టిక్కెట్టు ధరలను పెంచారు. రెగ్యులర్‌గా నడిచే సర్వీసులను సైతం స్పెషల్ కోటాకి మార్చేశారు. అంతటితో ఆగలేదు.. ఆన్లైన్లో నామ్ కే వాస్తేగా కొన్ని సీట్లు మాత్రమే అమ్ముతూ.. బస్ ఫుల్ అయ్యిందంటూ కలరింగ్ ఇస్తున్నారు. దీంతో ఎలాగైనా సొంతూరికి వెళ్లాలి అనుకునే వారు ఆయా ప్రైవేట్ ఆపరేటర్స్ ఆఫీసులకు టిక్కెట్ల కోసం వెళ్తున్నారు. ఆఫ్‌లైన్‌లో బాదుడు ప్రైవేటు ఆపరేటర్లు దాదాపు ప్రతీ బస్సులు పది నుంచి పదిహేను సీట్ల వరకు బ్లాక్ చేసి ఉంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆన్లైన్లో కాకుండా ఆఫ్‌లైన్‌లో వెళ్లి టిక్కెట్ బుక్ చేసుకోవాలంటే 50 శాతం అదనపు ఛార్జీలతో పాటు ఎక్స్ట్రా అమౌంట్ కూడా చెల్లించాల్సి వస్తుంది. అప్పుడే సీటు గ్యారెంటీ లేదంటే లేనట్టే. విజయవాడకి వెళ్లేందుకు టిక్కెట్ ఛార్జీకి అదనంగా రూ. 800 చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. చదవండి : దసరాకు 4 వేల ఆర్టీసీ బస్సులు -
బంగ్లాదేశ్‌లో ఉన్నామా? లేదా పాక్‌లోనా?: సీఎం ఫైర్
ముంబై: ‘‘ఈరోజు మనం పది తలల రావణుడికి ప్రతిరూపంగా కొన్ని ముఖాలను కాల్చివేస్తున్నాం. అందులో ముంబై పీఓకే అన్న ముఖం కూడా ఒకటి’’అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. అదే విధంగా నటుడు సుశాంత్ రాజ్‌పుత్ సింగ్ ఆత్మహత్య చేసుకుంటే, ఆ విషయంలో తన కుమారుడిని లాగే ప్రయత్నం చేశారంటూ విరుచుకుపడ్డారు. ఎవరు ఎన్నివిధాలుగా తమపై నిందలు వేయాలని చూసినా, తాము భయపడమని, న్యాయం తమవైపే ఉందని వ్యాఖ్యానించారు.(చదవండి: కంగనాపై మరో కేసు నమోదు..) ఇక కొంతమంది తనకు హిందుత్వ గురించి పాఠాలు బోధించాలని చూస్తున్నారని, అలాంటి వారు ముందుగా, తమ గురించి తాము తెలుసుకోవాలంటూ గవర్నర్, బీజేపీ నేతలను ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దసరా పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి హోదాలో ఉద్ధవ్ ఠాక్రే తొలిసారి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వతంత్ర వీరసావర్కర్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన విజయదశమి మేళా కార్యక్రమంలో మాట్లాడుతూ, గవర్నర్ వ్యవహార శైలి, బీజేపీ తీరు, సుశాంత్ రాజ్‌పుత్ మృతి, కంగన పీఓకే వ్యాఖ్యలు, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు తదితర అంశాలను ప్రస్తావించారు.(చదవండి: వ్యాక్సిన్: దేశం మొత్తానికి సమాన హక్కులు!) ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగంలోని కీలక అంశాలు 1. మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కొశ్యారీ ఇటీవల తన గురించి చేస్తున్న వ్యాఖ్యలను ఉద్దేశించి.. ‘‘నల్ల టోపీ పెట్టుకున్న ఆ వ్యక్తి, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ దసరా ప్రసంగాన్ని ఒకసారి వినండి. హిందుత్వ అంటే కేవలం ఆలయాల్లో పూజలు చేయడం మాత్రమే కాదు అని తెలుసుకోండి’’అని ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. 2. ‘‘ప్రభుత్వాన్ని కూలదోస్తామని కొంతమంది పదే పదే చెబుతున్నారు. నిజంగా మీకు దమ్ముంటే ఆ ప్రయత్నం చేయండి. మీరు కచ్చితంగా విఫలం అవుతారు. శివసేన సైలెంట్‌గా ఉంది కదా అని.. ఇష్టారీతిన రెచ్చిపోతే కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అప్పుడు శివ సైనికుల ఆగ్రహానికి మీరు తట్టుకోలేరు. 3. గోవాలో బీఫ్‌పై నిషేధం లేదు. కానీ మహారాష్ట్రలో పరిస్థితి ఏంటో తెలుసు కదా! ఇలాంటి వాళ్లు నాకు హిందుత్వ గురించి బోధిస్తున్నారు. 4. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్జీకి ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను. హర్యానా ఎన్నికల సమయంలో, కుల్దీప్ సింగ్ బిష్ణోయిని ముఖ్యమంత్రిని చేస్తామని వాళ్లు(బీజేపీ) చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల సమయంలోనూ ఇలాంటి వాగ్దానాలే చేశారు. కానీ ఏం జరిగింది? ఇప్పుడు.. నితీశ్ కుమార్ కాబోయే సీఎం అని చెబుతున్నారు. సంఘ్ విముక్త భారత్‌ను కోరుకున్న ఆయనకు గుడ్‌లక్. 5. బిహార్ ఎన్నికల్లో గెలిస్తే కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు. మరి మహారాష్ట్ర ప్రజలు ఎక్కడ జీవిస్తున్నారు? బంగ్లాదేశ్‌లోనా? పాకిస్తాన్‌లోనా? 6. సుశాంత్ రాజ్‌పుత్ సింగ్ ఆత్మమత్య చేసుకుంటే, బిహార్ పుత్రుడు బలవన్మరణం చెందాడని ప్రచారం చేశారు. ఆయన బిహార్‌కు చెందినవాడైనంత మాత్రాన, మా మహారాష్ట్రను అప్రదిష్టపాలు చేసేవిధంగా మాట్లాడతారా? ఈ విషయంలో, నా కుమారుడు ఆదిత్య పేరును మీరు ప్రస్తావించారు. మా పరువుకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు. మీరెంతగా ప్రయత్నించినా మమ్మల్ని ఏం చేయలేరు. 7. శివసేన అధినేతనైన నేను కూడా ముంబై పోలీసునే. మీకు రక్షణ కల్పించేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడే పోలీసుల గురించి అలా ఎలా మాట్లాడతారు? ముంబైని పీఓకేతో పోల్చి ప్రధాని నరేంద్ర మోదీని అవమానపరిచారు. భారత్‌లో పీఓకే ఉందంటే, అది ప్రధాని వైఫల్యం కాదా? 8. వాళ్లుదేశాన్ని విభజిస్తున్నారు. కానీ మహారాష్ట్రలో వాళ్ల ఆటలు సాగవు. మేం సాగనివ్వం. ప్రతి విషయానికి ఓ హద్దు ఉంటుంది. సహనం నశిస్తే మేమే మిమ్మల్ని బ్రేక్ చేస్తాం. మా ప్రభుత్వాన్ని కూలదోసే ముందు మీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. బిహార్ ప్రజలు అన్ని ఆలోచించిన తర్వాతే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. 9. మహమ్మారి కోవిడ్-19 వ్యాప్తి గురించి పట్టించుకోని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టే పనిలో ఉంది. త్వరలోనే ఇక్కడ ఆలయాలను తెరుస్తాం. లాక్డౌన్ పొడిగించాలని లేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్తగా మసలుకోవడమే మంచిది 10. మరాఠా, ధంగర్, ఓబీసీలంతా ఒక్కటిగా ఉండాలి. మహారాష్ట్ర ఒక్కటిగా ఉండటం కోసం అంతా ఐక్యంగా ఉండాలని అభ్యర్థిస్తున్నా. दसरा मेळावा - २०२० https://t.co/98TroPYYw8 — Office of Uddhav Thackeray (@OfficeofUT) October 25, 2020 -
అమ్మవారి రూపాన్ని ధైర్యంగా చూడగలరా?!
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా చేసుకునే పండుగ విజయదశమి. యావద్భారతం ఏటా ఎంతో వైభవంగా జరుపుకొనే ఉత్సవం. అయితే ఈసారి కరోనా కారణంగా పరిస్థితులు మారిపోయాయి. మునుపటి స్థాయిలో కాకపోయినా, కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూనే ప్రజలు పండుగ సంబరాల్లో పాల్గొంటున్నారు. కాగా, తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రులు నిర్వహించి, పదో రోజును విజయదశమి లేదా దసరాగా జరుపుకొంటారన్న విషయం తెలిసిందే. అయితే అన్నిచోట్లా ఈ ఉత్సవాలు ఒకేరకంగా నిర్వహించరు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్‌లోని ప్రాంతీయ, సాంస్కృతిక వైవిధ్యమంతా ఈ పండుగ ఉత్సవాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఎక్కడైనా దసరా అంటే శక్తి ఆరాధనే. శక్తి స్వరూపిణిని అయిన అమ్మవారిని కొలిచే సందర్భమే. మహిషాసురుడిని వధించిన ఆ దుష్టసంహారిణికి జేజేలు పలుకుతూ, మమ్మల్ని కాపాడు తల్లీ అంటూ వేడే వేడుక. (చదవండి: శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారు) మరి ఆ అమ్మవారికి ప్రతిరూపమైన మహిళలకు ఈదేశంలో ఏపాటి గౌరవం దక్కుతోంది? దుర్గామాత విశ్వరూపం గురించి తెలిసిన మనం, ప్రతి ఆడబిడ్డలోనూ అంతర్లీనంగా దాగి ఉండే ఆ ఆదిశక్తికి ఎంత విలువ ఇస్తున్నాం? ‘యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా’అంటూ స్త్రీలకు అత్యున్నత స్థానాన్ని కల్పించిన కర్మభూమి మా జన్మస్థానం అని గర్వంగా చెప్పుకొనే వాళ్లలో లింగభేదాలకు అతీతంగా, ఎంతమంది మహిళను పురుషులతో సమాననంగా, ముఖ్యంగా సాటి మనిషిగా చూడగలుగుతున్నారు? ఆ దేవి అనుగ్రహం పొందేందుకు హారతులు పట్టి, పెద్ద ఎత్తున పండుగ చేస్తున్న వారిలో, కడుపులో ఉన్నది ఆడశిశువు అని తెలియగానే గర్భంలోనే అంతం చేస్తున్న వాళ్లు ఎందరు? అన్ని అవాంతరాలు దాటుకుని ఎలాగోలా భూమి మీద పడి, ఎన్నెన్నో సవాళ్లు ఎదుర్కొని విద్యాసంస్థల్లో అడుగుపెడితే ప్రేమ పేరిట వేధించే పోకిరీలు, వాటిని అధిగమించి కార్యక్షేత్రంలోకి దిగితే అడుగడుగునా వివక్ష, ఇక గృహిణిగా అంతాతానై కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్న ఇల్లాలికి కనీస గౌరవం ఇవ్వకుండా చిన్నచూపు చూసేవిధంగా వ్యవహరించే తంతు ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణమేనని కొట్టిపారేసే మహానుభావులు ఎందరు? ఇక నెలల పసికందు నుంచి పండు ముసలిదాకా మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మృగాళ్ల పశువాంఛకు బలైపోతున్న ఆడవాళ్ల సంఖ్యకు లెక్కేలేదు. నేర గణాంక సంస్థల లెక్కల పరిగణనలోకి రాని అవ్యవస్థీకృత నేరాలు కోకొల్లలు. అనాదికాలం నుంచి నేటి ఆధునిక స్మార్ట్ యుగం దాకా.. హథ్రాస్ ఉదంతం వంటి ఎన్నెన్నో దారుణాలకు సాక్షీభూతంగా నిలిచిన సమాజం, ఏ న్యాయస్థానం ముందు దోషిగా నిలబడకపోవచ్చు. కానీ ఆ దుర్గాదేవి విజయాన్ని ఉత్సవంగా జరుపుకొనే ఈ పర్వదినంనాడు, ఆ అమ్మవారి ముందు ధైర్యంగా నిలబడి, ఆ తల్లి రూపాన్ని చూస్తూ మనస్ఫూర్తిగా ఆమె అనుగ్రహం కోరే ధైర్యం ఎంతమందికి ఉంటుంది! దసరా పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న నిజమైన స్ఫూర్తిని గ్రహించగలిగితే, ఇతరులకు చెడు చేయకుండా ఉండటం సహా బాధితుల పక్షాన పోరాడే గుణాన్ని ప్రతి ఒక్కరు పెంపొందించుకోవచ్చు. గతంలో ఎలా ఉన్నా సరే నేటి నుంచైనా పద్ధతి మార్చుకుని, మనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవీయత, అహంకారం వంటి దుర్గుణాలను అంతం చేయమంటూ ‘ఆయుధ పూజ’కు సంసిద్ధులమవుదాం!! -
విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, విజయవాడ : దసరా ఉత్సవాల సందర్భంగా ఈనెల 17 నుంచి 25వ తేదీ వరకు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగర ప్రజలకు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్ మళ్ళింపులు చేశామని ,పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామని సీపీ బత్తిన శ్రీనివాసులు అన్నారు. విజయవాడ మీదుగా ఇతరప్రాంతాలకు వెళ్లే వాహనాలకు సిటీలోకి అనుమతి లేదని తెలిపారు. విశాఖపట్నం - హైదరాబాద్ మధ్య వాహనాలు హనుమాన్ జంక్షన్ నూజివీడు-మైలవరం-జీ కొండూరు - ఇబ్రహీంపట్నం మీదుగా, విశాఖపట్నం-చెన్నై మధ్య వాహనాలు హనుమాన్ జంక్షన్-అవనిగడ్డ-రేపల్లె-బాపట్ల-చీరాల మీదుగా, గుంటూరు -విశాఖపట్నం మధ్య వాహనాలు బుడంపాడు నుంచి పొన్నూరు-రేపల్లె-అవనిగడ్డ-హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లింపు చేయనున్నట్లు వెల్లడించారు. * విజయవాడ - హైదరాబాద్ మధ్య ఆర్.టి.సి. బస్సులు రాకపోకలను పండిట్ నెహ్రూ బస్ స్టాండ్-చల్లపల్లి బంగ్లా- బుడమేరు వంతెన - పైపుల రోడ్-సితార- గొల్లపూడి వై జంక్షన్ ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లింపు * విజయవాడ-ఇబ్రహీంపట్నం మధ్య సిటీ బస్సులను ప్రకాశం స్టాట్యూ -లో బ్రిడ్జ్- గద్ద బొమ్మ కె.ఆర్. మార్కెట్- పంజా సెంటర్- నెప్రో చౌక్- చిట్టినగర్-టన్నెల్- సితార-గొల్లపూడి-ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లింపు * ఇబ్రహీంపట్నం నుండి గొల్లపూడి-సితార-సి.వి. ఆర్ పై ఓవర్-చిట్టినగర్-నెహ్రూ చాక్-పంజా సెంటర్ కే.ఆర్ మార్కెట్ లో బ్రిడ్జి- ప్రకాశం స్టాట్యూ -ఏ.సి.ఆర్-సిటీ బస్ స్టాప్ కు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు ప్రకాశం బ్యారీజీ మీ వాహనాలకు అనుమతి లేదు మూల నక్షత్రం రోజు ఈనెల 20వ తేది రాత్రి నుంచి ఉదయం వరకు ప్రకాశం బ్యారేజ్ మీదకు వాహనాలకు అనుమతి లేదని సీపీ తెలిపారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. మోటార్ వాహనాల కోసం పద్మావతి ఘాట్, ఇరిగేషన్ పర్కింగ్, గద్ద బొమ్మ, లోటస్ అపార్ట్ మెంట్, ఆర్.టి.సి. వర్క్ షాప్ రోడ్ , కార్ల కొరకు సీతమ్మవారి పాటలు, గాంధీజీ మున్సిపల్ హై స్కూల్, టి.టి.డి పార్కింగ్ లను ఏర్పాటు చేశారు. బస్సుల కొరకు పున్నమి ఘాట్ వద్ద పార్కింగ్ ప్రదేశాన్ని ఉంచారు. భక్తులు వచ్చిన మార్గంలోనే వెనక్కి వెళ్లాలి హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు భవానీపురం లారీ స్టాండ్ వద్ద సర్వీస్ రోడ్ నుంచి పున్నమి హోటల్ వద్ద కుడి వైపు తిరిగి పున్నమి ఘాట్ వద్ద పార్క్ చేయాలి. విశాఖపట్నం నుంచి వచ్చే భక్తులు రామవరప్పాడు రింగ్ వద్ద ఇన్నర్ రింగ్ రోడ్ పైపుల రోడ్-వై.వి.రావు ఎస్టేట్-సి.వి.ఆర్. పై ఓవర్-సితార జంక్షన్-ఆర్ టి.సి. వర్క్ షాప్ రోడ్-పున్నమి హోటల్ మీదుగా వచ్చి పున్నమి ఘాట్‌లో పార్క్ చేయాలి. గుంటూరువైపు నుంచి వచ్చే భక్తులు వారధి-కృష్ణలంక ప్లై ఓవర్- ఆర్.టి.సి. ఇన్ గేట్-దుర్గా పై ఓవర్- స్వాతి జంక్షన్-వేంకటేశ్వర ఫౌండ్రీ వద్ద యూ టర్న్ తీసుకొని పున్నమి హోటల్ వరకు వచ్చి అక్కడ కుడి వైపు తిరిగి పున్నమి ఘాట్‌లో పార్క్ చేయాలి భక్తులు వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్లాలని సీపీ బత్తిన శ్రీనివాసులు వెల్లడించారు. -
దసరాకి సెలవు లేదా ?
కర్ణాటక, యశవంతపుర: 2020–2021 విద్యా సంవత్సరపు సెలవులను అధికారులు ప్రకటించారు. అయితే విజయదశమి పండుగకు సెలవును ప్రకటించలేదు. దీంతో ప్రైవేట్ విద్యా సంస్థల పాలన మండలి ఒక్కూట అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. హిందువుల పవిత్రమైన పండుగకు సెలవును ప్రకటించకపోవటంతో ప్రజలు అధికారులపై మండిపడుతున్నారు. దసరా సెలవులు అక్టోబర్ 3 నుంచి 25 వరకు ఇచ్చారు. 26న విజయదశమికి పాఠశాలలను తెరవాలని విద్యా శాఖ ఆదేశించింది. 26న సెలవు ఉన్నా విద్యాశాఖ కళ్లు మూసుకుని సెలవుల జాబితా రూపొందించిందని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం మండిపడింది. -
‘పండుగలు మన విలువలకు ప్రతీక’
సాక్షి, న్యూఢిల్లీ : మన పుణ్యభూమిలో పండుగలు ఘనమైన విలువలు, సామాజిక జీవితం, విద్యలో భాగమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పండుగలు మనల్ని ఏకంచేసి అందరినీ మమేకం చేస్తాయని, అవి మనలో ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని, నూతన స్వప్నాలను నింపుతాయని వ్యాఖ్యానించారు. దసరా సందర్భంగా ప్రధాని మోదీ రాంలీలా మైదానంలో జరిగిన రావణదహనం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మహాత్మా గాంధీ 150వ జయంతిని జరుపుకుంటున్న క్రమంలో పౌరులంతా ఈ ఏడాది ఒక సమున్నత లక్ష్యాన్ని సాధించాలని పిలుపు ఇచ్చారు. ఆహార వృధాను అరికట్టడం, ఇంధన ఆదా, నీటి పొదుపు లక్ష్యంగా మనం ముందుకుసాగాలని కోరారు. -
సెలబ్రిటీల హ్యాపీ దసరా..
ముంబై : దేశవ్యాప్తంగా విజయదశమి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటుండగా ప్రముఖలు, బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి అందరి జీవితాల్లో వెలుగులు పంచాలని ఆకాంక్షిస్తూ బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు అందచేశారు. రావణుడిని వధించిన ఈరోజు ప్రపంచమంతా వెలుగులు నిండాయని బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ అన్నారు. చీకటిని చీల్చుతూ వెలుగులు విరజిమ్మిన శక్తికి ప్రతీకగా మనం ఈ పండుగ జరుపుకుంటామని, అందరూ దసరాను ఆస్వాదించాలని ఆకాంక్షిస్తూ సోనం ట్వీట్ చేశారు. అందరికీ దసరా శుభాకాంక్షలు.. చెడుపై మంచి సాధించిన విజయాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామని ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ అన్నారు. ఈ ఏడాది అంతా మన జీవితం వెలుగులు నింపాలని కోరుతూ హ్యాపీ దసరా అంటూ హీరో అర్జున్ కపూర్ ట్వీట్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, తమన్నా, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మి, సుస్మితా సేన్, ఆదితిరావు హైదరి, జుహి చావ్లా తదితరులు దసరా శుభాకాంక్షలు తెలిపారు. -
వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. 'మీకు, మీ కుటుంబానికి శుభాలు కలగాలని ఆశిస్తూ విజయదశమి శుభాకాంక్షలు' అంటూ వైఎస్ జగన్ తెలుగులో ట్వీట్ చేశారు. ఈ నెల 11న దసరా పండగ జరగనున్న సంగతి తెలిసిందే. దేవీనవరాత్రుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రజలకు దుర్గా పూజ శుభాకాంక్షలు తెలియజేశారు. మీకు మీ కుటుంబానికి శుభాలు కలగాలని ఆశిస్తూ విజయదశమి శుభాకాంక్షలు — YS Jagan Mohan Reddy (@ysjagan) 9 October 2016 -
శివయ్యా.. బంగారుబల్లిని చూపవయ్యా
శ్రీకాళహస్తీశ్వరాలయంలో బల్లి శిల్పం ఉన్నట్టు పదేళ్ల కిందట గుర్తించారు. వెండి తొడుగు అమర్చి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆ తర్వాత భక్తులు సమర్పించిన బంగారు తొడుగును అమర్చారు. అయితే గత ఏడాది విజయదశమి సందర్భంగా స్వామి దర్శన క్యూలను మార్పు చేశారు. దీంతో బంగారు బల్లి దర్శనానికి భక్తులు దూరమయ్యారు. అసంతృప్తితో వెనుదిరుగుతున్నారు. శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: బంగారు బల్లిని తాకితే బల్లిపడటం వల్ల కలిగే అనర్థాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే కంచి ఆలయాన్ని దర్శించే భక్తులు ఖచ్చితంగా అక్కడి బంగారు బల్లిని స్పర్శించి తరిస్తారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధ్వజస్తంభానికి పక్కనే పైకప్పుకు అమర్చిన రాళ్లపై బల్లి శిల్పం ఉన్నట్టు పదేళ్ల్ల కిందట గుర్తించారు. దీనికి తొలుత వెండి తొడుగును, ఆ తర్వాత బంగారు తొడుగును అమర్చారు. ఇక్కడే ఆ భాగ్యం కలగడంతో కంచికి వెళ్లలేని భక్తులు ఎంతో సంతోషించారు. అయితే ఆలయ అధికారుల అనాలోచిత నిర్ణయం కారణంగా ప్రస్తుతం భక్తులకు బల్లిని తాకే భాగ్యం కరువవుతోంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి, అమ్మవార్ల దర్శనమే కాకుండా అనేక దర్శనీయ ప్రదేశాలున్నాయి. వాటిలో బంగారుబల్లి ఒకటి. స్వామి సన్నిధికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం వద్ద ఆలయ పైకప్పులో రాతి బండపై బల్లి రూపాన్ని చెక్కారు. పదేళ్ల్ల క్రితం ఆలయాధికారులు గుర్తించి వెండి తొడుగును అమర్చారు. భక్తులకు వీలుగా ఉండేందుకు ప్రత్యేక నిచ్చెన ఏర్పాటు చేశారు. 2010 ఫిబ్రవరిలో జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన భక్తులు బంగారు తొడుగును విరాళంగా అందజేశారు. దీంతో వెండి తొడుగు స్థానంలో బంగారు తొడుగు అమర్చారు. శరీరంపై బల్లి పడిన వారే కాకుండా, దోష నివారణ కోసం ఆలయానికి వచ్చే భక్తులు బంగారు బల్లిని తాకేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన విజయదశమి పండుగ సందర్భంగా స్వామివారి దర్శనానికి ఉన్న క్యూలను మార్పు చేశారు. బంగారుపల్లి వద్దకు వెళ్లకుండా గేట్లు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి బంగారుబల్లి దర్శనం భక్తులకు కరువైంది. దీంతో స్థానికులతో పాటు దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు బంగారుబల్లిని దర్శించే వీలులేక అసంతృప్తిగా వెనుదిరుగుతున్నారు. బంగారుబల్లిని తాకే అవకాశం కల్పించాలి శివయ్య సన్నిధిలో ఉన్న బం గారుబల్లిని దర్శించి, తాకేం దుకు హైదరాబాద్ నుంచి వచ్చాం. బంగారు బల్లిని తాకితే దోషాలు నివారణ అవుతాయన్నది గట్టి విశ్వా సం. అయితే ఆధికారులు బల్లిని తాకే అవకాశం కల్పించలేదు. దీంతో అసంతృప్తిగా వెళుతున్నాం. - సంధ్య, హైదరాబాద్ పరిశీలించి భక్తులకు అవకాశం కల్పిస్తాం ఆలయంలో బంగారుబల్లిని దర్శించుకునే అవకాశం ఎప్ప టి నుంచో ఉంది. ఏడాది క్రితం క్యూను సవరించిన దృష్ట్యా కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ప్రత్యేకంగా ఏ ర్పాటు చేసిన నిచ్చెనను తొల గించారు. పరిశీలించి మళ్లీ బంగారుబల్లిని తాకే సదుపాయం కల్పిస్తాం. - శ్రీరామచంద్రమూర్తి, ఈవో -
జిల్లాలో ఘనంగా విజయ దశమి వేడుకలు
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో విజయదశమి వేడుకలు అంబరాన్నంటాయి. సకల విజయ వరప్రదాయిని దుర్గా మాతకు భక్తులు విశేష పూజలు నిర్వహించారు. దసరా పర్వదినం సందర్భంగా ఆదివారం జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దుర్గమ్మకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు జరిపారు. వృత్తి, వ్యాపారాల రీత్యా దూర ప్రాంతాల్లో నివాస ముంటున్న ప్రజలు పిల్లాపాపలతో కలిసి సొంతఊళ్లకు తరలివచ్చి పండగ జరుపుకున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, నేతలు సొంత నియోజకవర్గ ప్రజల మధ్య దసరా ఉత్సవాలు నిర్వహించుకోగా..మరికొందరు ఎప్పటిలాగే ప్రజలకు ‘దూరం’గా ఉండిపోయారు. అందోల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, జహీరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గీతారెడ్డిలు పండగ పూట హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. మంత్రులకు శుభకాంక్షలు తెలిపేందుకు ముఖ్య అనుచరులు హైదరాబాద్‌కు వెళ్లారు. సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తెలంగాణ సంఘాల ఆహ్వానం మేరకు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి ఇప్పటికే దుబాయ్‌కు వెళ్లడంతో ఆయన స్థానికంగా పండగను జరుపుకోలేకపోయారు. ఆదివారం రాత్రి దుబాయ్ నుంచి తిరిగి వచ్చాకా సోమవారం సిద్దిపేటకు చేరుకుని స్థానికంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిసింది. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఎప్పటిలాగే తొమ్మిదురోజుల దీక్ష చేపట్టి ఈ ఏడాదీ కూడా తన మాతృమూర్తి ఊరు జన్నపల్లి (నిజామబాద్ జిల్లా) దసరా వేడుకలను జరపుకున్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్లారు. ఇక మెదక్ ఎంపీ విజయశాంతి సైతం హైదరాబాద్‌లోని తన నివాసానికి పరిమితమయ్యారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సునితా లక్ష్మారెడ్డి శివ్వంపేట మండలంగొమారంలోని అత్తారింట్లో పండుగ జరుకున్నారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ తన సోదరుడితో కలిసి నారాయణ్‌ఖేడ్‌లోని నివాసంలో వేడుకలు నిర్వహించుకున్నారు. స్థానిక సర్పంచ్ అప్పారావు షెట్కార్ ఆధ్వర్యంలో మినీ స్టేడియంలో జరిగిన రావణాసురుడి దహన కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి పట్టణంలోని మంగల్‌పేటలోని తన నివాసంలో పండగ జరుపుకున్నారు. కార్యకర్తలతో కలిసి ఊరి శివారులో ఉన్న జమ్మిచెట్టుకు పూజలు నిర్వహించారు. దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి తొగుట మండలం తుక్కాపూర్‌లో వేడుకలు జరుపుకున్నారు. పటాన్చెరు మైత్రి మైదానంలో మహంకాళి సేవాసమితి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా జరిగిన రావణ దహన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్‌తో పాటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వపాన్‌దేవ్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి గూడెం మహిపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి రాంచంద్రాపురంలోని అతిథి గృహం వద్ద ఉన్న జమ్మిచెట్టు వద్ద లెసైన్స్డ్ తుపాకీతో గాల్లో కాల్పులు జరిపి సంబరాలను ప్రారంభించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి అనవాయితీ ప్రకారం స్థానిక ఔట్‌డోర్ స్టేడియంలో వేలాది మంది ప్రజల మధ్య దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. భారీ వ్యయంతో ఏర్పాట్లు చేసి మరోసారి తన ప్రత్యేకతను జగ్గారెడ్డి నిలబెట్టుకున్నారు.