సాక్షి, న్యూఢిల్లీ : మన పుణ్యభూమిలో పండుగలు ఘనమైన విలువలు, సామాజిక జీవితం, విద్యలో భాగమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పండుగలు మనల్ని ఏకంచేసి అందరినీ మమేకం చేస్తాయని, అవి మనలో ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని, నూతన స్వప్నాలను నింపుతాయని వ్యాఖ్యానించారు. దసరా సందర్భంగా ప్రధాని మోదీ రాంలీలా మైదానంలో జరిగిన రావణదహనం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మహాత్మా గాంధీ 150వ జయంతిని జరుపుకుంటున్న క్రమంలో పౌరులంతా ఈ ఏడాది ఒక సమున్నత లక్ష్యాన్ని సాధించాలని పిలుపు ఇచ్చారు. ఆహార వృధాను అరికట్టడం, ఇంధన ఆదా, నీటి పొదుపు లక్ష్యంగా మనం ముందుకుసాగాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment