కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో విజయదశమిని పురస్కరించుకొని శుక్రవారం సోనాగచిలోని సెక్స్ వర్కర్లు దుర్గాదేవికి పూజలు నిర్వహించారు. దుర్గాదేవి పూజ అనంతరం డెబీ బోరాన్, సిందూర్ ఖేలా, ధునుచి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా సెక్స్ వర్కర్ల దర్బార్ మహిళా సమితి సభ్యురాలు విశాఖ లష్కర్ మాట్లాడుతూ.. ఈ సమాజంలో తమకు సమాన హక్కులు లేవని, అందుకే తమ పిల్లలు ఈ సమాజాన్ని ఆమోదించడంలేదని అన్నారు.
దీంతో తాము మరో ప్రపంచం నుంచి వచ్చామనే భావన కలుగుతోందని తెలిపారు. దానికి గల కారణం తాము సెక్స్ వర్కర్లము కావడమే అనిపిస్తోందని అన్నారు. కుటుంబాలను పోషించుకోవటం కోసమే తాము ఈ వృత్తిలో ఉన్నమని తెలిపారు. అయితే దుర్గా పూజ వేడకలు జరుపుకోవడాని తమకు కూడా హక్కు ఉందని పేర్కొన్నారు. తాము ఈ సమాజమానికి చెందినవారిమనే సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నామని తెలిపారు.
ప్రతి సెక్స్ వర్కర్‌కు దుర్గాదేవి పూజ చేసుకునే హక్కు ఉందని పేర్కొన్నారు. అయితే దుర్గాదేవి పూజలు నిర్వహించేందుకు గతంలో వీరికి అనుమతి ఉండేది కాదు. దాని కోసం వీరు పోరాటం చేశారు. సెక్స్ వర్కర్లు దుర్గాపూజ చేసేందుకు అనుమతి కోసం దర్బార్ మహిళా సమితి కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. దీంతో వారికి దుర్గాపూజ చేసుకోవచ్చని 2013లో కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment