HYD: రేపటి నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు | Traffic Restrictions In Hyderabad Due To Ganesh Festival 2024, Check Out Diverted Routes Details | Sakshi
Sakshi News home page

Ganesh Festival Traffic Diversions: హైదరాబాద్‌లో రేపటి నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు

Published Fri, Sep 6 2024 1:51 PM | Last Updated on Fri, Sep 6 2024 2:42 PM

Traffic Restrictions In Hyderabad Due To Ganesh Festival

సాక్షి,హైదరాబాద్‌: వినాయకచవితి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్‌లో బడా గణేష్‌తో పాటు హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నందున ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు తెలిపారు.

సెప్టెంబర్‌ 7నుంచి 17వ తేదీ నిమజ్జనం అర్ధరాత్రి వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ విశ్వప్రసాద్‌ తెలిపారు. ముఖ్యంగా ఖైరతాబాద్‌ వినాయకుని పరిసర ప్రాంతాలు ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్‌, మింట్‌కాంపౌండ్‌లో ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు.

  • ఖైరతాబాద్‌ వినాయక విగ్రహం నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ అనుమతించలేదు.
  • పాత సైఫాబాద్ పీఎస్‌ నుంచి ఖైరతాబాద్‌ గణేష్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ రాజ్‌దూత్ లేన్‌లోకి అనుమతించరు.
  • ఇక్బాల్ మినార్ నుండి మింట్ కాంపౌండ్ లేన్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ అనుమంతించరు.
  • ఎన్టీఆర్‌ మార్గ్/ఖైరతాబాద్ ఫ్లైఓవర్/నెక్లెస్ రోడ్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ అనుమతించరు.
  • నెక్లెస్ రోటరీ వద్ద తెలుగు తల్లి జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు నిరంకారి నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్
    ఖైరతాబాద్ పోస్టాఫీసు లేన్ ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు అనుమతించరు.

నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా ఖైరతాబాద్‌ బడా గణేష్ దర్శనానికి వచ్చే సందర్శకులు తమ వాహనాలను ఐమాక్స్ థియేటర్ పక్కన అంబేద్కర్ స్క్వేర్ పార్కింగ్ స్థలం, ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్ స్థలాలు, ఐమాక్స్ ఎదురుగా, సరస్వతి విద్యా మందిర్ హైస్కూల్ ప్రాంగణం, రేస్ కోర్స్ రోడ్ పార్కింగ్ ప్లేస్‌లో పార్క్ చేయాలని పోలీసులు కోరారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement