![Indian Racing League Called Off: Vehicles Allowed in Hussain Sagar Road - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/22/hussain-sagar-road.jpg.webp?itok=z5oPZ0DN)
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో శని, ఆదివారాల్లో ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్‌ఎల్) నిర్వహించారు. దీంతో ఇటువైపుగా వచ్చే వాహనాలను దారి మళ్లించారు. కార్ రేసింగ్ ముగియడంతో సోమవారం వాహనాలను కొత్తగా నిర్మిస్తున్న రాష్ట్ర కొత్త సచివాలయం ముందు నుంచి అనుమతించారు. రెండురోజుల పాటు ఇబ్బందులకు గురైన వాహన చోదకులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, కార్ రేసింగ్ కోసం ఈ మార్గంలో ప్రత్యేకంగా ట్రాక్‌ను నిర్మించారు.
దేశంలోనే తొలి స్ట్రీట్ సర్క్యూట్ ఇండియన్ రేసింగ్ లీగ్‌ను హుస్సేన్ సాగర్ తీరంలో శని, ఆదివారాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే చెన్నై జట్టుకు చెందిన కారు ప్రమాదానికి గురికావడంతో రేసింగ్‌ను నిర్వాహకులు నిలిపివేశారు. దీంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. డిసెంబర్ 10, 11 తేదీల్లో మళ్లీ ఇక్కడ కార్ రేసింగ్ నిర్వహిస్తారు. (క్లిక్ చేయండి: రేస్ లేకుండానే ముగిసిన లీగ్...)
Comments
Please login to add a commentAdd a comment